Pub లో పనిచేస్తున్న యువతిపై పెళ్లిపేరుతో లైంగిక దాడి.. చివరికి..

ABN , First Publish Date - 2021-12-04T16:42:04+05:30 IST

సోదరుడు లేని సమయంలో పలుమార్లు లైంగిక దాడి చేశాడు...

Pub లో పనిచేస్తున్న యువతిపై పెళ్లిపేరుతో లైంగిక దాడి.. చివరికి..

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : పబ్‌లో పనిచేస్తున్న ఉద్యోగినిపై ఓ కుక్‌ లైంగిక దాడి చేశాడు. నగరంలోని ఓ పబ్‌లో కుక్‌గా చేరిన యువతిని అదే పబ్‌లో కుక్‌గా పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రం పూరి నగరానికి చెందిన బి.సత్యజిత్‌ బెహ్రా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె సోదరుడు లేని సమయంలో పలుమార్లు లైంగిక దాడి చేశాడు. అనంతరం అతన్ని పెళ్లి చేసుకోవాలని కోరగా ముఖం చాటేశాడు. మరో యువతితో వివాహానికి సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సత్యజిత్‌ బెహ్రాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-04T16:42:04+05:30 IST