గ్రేటర్‌లో పబ్లిక్‌ చార్జింగ్‌ పాయింట్లు

ABN , First Publish Date - 2022-07-02T18:06:19+05:30 IST

ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా నగరంలో పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. జీహెచ్‌ఎంసీ

గ్రేటర్‌లో పబ్లిక్‌ చార్జింగ్‌ పాయింట్లు

విద్యుత్‌ వాహనాల కోసం..  

ప్రయోగాత్మకంగా 14 ప్రాంతాల్లో

హైదరాబాద్‌ సిటీ: ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా నగరంలో పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. జీహెచ్‌ఎంసీ, తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్కో) సంయుక్తంగా చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నాయి. గ్రేటర్‌ పరిధిలో 230, హెచ్‌ఎంఏడీ పరిధిలోని ప్రాంతాల్లో 100 చార్జింగ్‌ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయోగాత్మకంగా 14 ప్రాంతాల్లో పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే కారిడార్లలో పార్కింగ్‌ స్థలమున్న ప్రాంతాలను ఎంపిక చేసి చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నా రు. ఒక్కో ఏరియాలో వేగంగా, నెమ్మదిగా చార్జింగ్‌ అయ్యే వేర్వేరు పాయింట్లు అందుబాటులో ఉంటాయి. త్వరగా చార్జింగ్‌ కావాలంటే కొంత ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసినందుకు టీఎస్‌ రెడ్కో జీహెచ్‌ఎంసీకి యూనిట్‌కు రూపాయి చొప్పున.. ప్రతి మూడు నెలలకు బిల్లులు చెల్లించనుంది.  

14 ప్రాంతాలివి..

 ఇందిరాపార్కు, పార్కింగ్‌ ప్లేస్‌, కేబీఆర్‌ పార్క్‌ గేట్‌-1 పార్కింగ్‌, కేబీఆర్‌ పార్క్‌ గేట్‌-3 పార్కింగ్‌, కేబీఆర్‌ పార్క్‌ గేట్‌ -6 పార్కింగ్‌ 

 ట్యాంక్‌బండ్‌ కందుకూరి వీరేశలింగం విగ్రహం, బషీర్‌బాగ్‌ రోడ్డు ఒత్రిస్‌ రెస్టారెంట్‌. గన్‌ఫౌండ్రి మహబూబియా గర్ల్స్‌ జూనియర్‌ కాలేజ్‌. మునిసిపల్‌ ఆఫీస్‌ ఆబిడ్స్‌ , నానక్‌రాంగూడ జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌. మహవీర్‌ హరిణ వనస్థలి నేషన్‌ పార్క్‌ అనన్య రిసార్ట్‌, శిల్పారామం-2 నాగోల్‌ బ్రిడ్జి మెట్రో ఆఫీస్‌, ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ పార్కింగ్‌, ఓవైసీ ఆస్పత్రి, తాజ్‌ త్రీ స్టార్‌ హోటల్‌(ఎస్‌డీ రోడ్‌) 

Updated Date - 2022-07-02T18:06:19+05:30 IST