ప్రమాదంలో ప్రజారోగ్యం: ఎమ్మెల్యే అశోక్‌

ABN , First Publish Date - 2021-06-17T04:00:15+05:30 IST

రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఆరోపించారు. బుధవారం కవిటి తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ జీవన్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు.

ప్రమాదంలో ప్రజారోగ్యం: ఎమ్మెల్యే అశోక్‌
కవిటిలో వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌




 కవిటి: రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఆరోపించారు. బుధవారం కవిటి తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ జీవన్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేకపోవడం వల్లనే కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.  కరోనాను అరికట్టేందుకు కేంద్రం 65 లక్షల వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేయగా, వైసీపీ ప్రభుత్వం కేవలం 26 లక్షలు డోసులను మాత్రమే వినియోగించిందని ఆరోపించారు. ఇప్పటికీ ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తి కాలేదని విమర్శించారు. కరోనాతో మరణంచిన వారికి అంత్యక్రియల నిమిత్తం రూ.15వేలు ప్రకటించిన ప్రభుత్వం ఒక్కరికీ అందజేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటరమణ, జడ్పీటీసీ మాజీ సభ్యులు బి.రమేష్‌, పి.కృష్ణారావు, సంతోష్‌ పట్నాయక్‌, బి.చినబాబు తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-06-17T04:00:15+05:30 IST