అర్జీదారుతో మాట్లాడుతున్న కలెక్టర్
కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ
నిర్మల్టౌన్, జూన్ 27 : సుదూర ప్రాంతాల నుంచి వివిధ సమస్యలతో వచ్చే బాధితుల సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరిం చాలని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదులలో భాగంగా అర్జీదారుల నుంచి అర్జీలను అదనపు కలెక్టర్ స్వీకరించారు. 19 దరఖాస్తులు వచ్చాయని, భూ సమస్యలు, పెన్షన్, తదితర అర్జీలను సంబంధిత అధికారులను పరిష్కరిం చాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, పి. రాంబాబు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.