వైసీపీ ప్రభుత్వంలో ప్రజా జీవనం అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2022-09-24T05:34:36+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. హనుమంతునిపాడు మండలంలోని నందనవనం గ్రామంలో శుక్రవారం రాత్రి బాదుడే బాదుడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఉప్పు నుంచి పప్పు, నూనె నుంచి పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు అమాంతంగా పెరిగిపోయాయని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వంలో ప్రజా జీవనం అస్తవ్యస్తం
బాదుడేబాదుడు కార్యక్రమానికి వచ్చిన డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి సత్కరిస్తున్న గ్రామస్థులు

  టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి 
హనుమంతునిపాడు (కనిగిరి), సెప్టెంబరు 23 : వైసీపీ ప్రభుత్వంలో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. హనుమంతునిపాడు మండలంలోని నందనవనం గ్రామంలో శుక్రవారం రాత్రి బాదుడే బాదుడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఉప్పు నుంచి పప్పు, నూనె నుంచి పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు అమాంతంగా పెరిగిపోయాయని చెప్పారు. నిత్యావసర సరకులతో పాటు ఆర్టీసీ రవాణా చార్జీలను కూడా పెంచి ప్రజలపై సీఎంజగన్‌రెడ్డి పెనుభారం మోపారని విమర్శించారు. పెరిగిన ధరలతో ప్రజలు బెంబేలెత్తి పోతుంటే, మరో పక్క అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీసే స్థితికి తీసుకు వచ్చారని ధ్వజమెత్తారు. పథకాల పేరు చెప్పి అప్పులు చేస్తూ తెచ్చిన రుణాలను  వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల జేబుల్లో నింపుకుంటున్నారని ఆరోపించారు.  తెచ్చిన అప్పులకు సార్ధకత సాధించటం లేదని, దీంతో ప్రజలపైనే భారం పడుతున్నదని అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి హాజరైన డాక్టర్‌ ఉగ్రకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. గ్రామంలోకి వచ్చిన ఉగ్రకు ప్రజలు పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, మండలపార్టీ అఽధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు గాయం తిరుపతిరెడ్డి, రఘునాఽథకాశిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కావేటి శేషయ్య, నాయకులు రెడ్డెం తిరుపతిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పెన్నా గురవయ్య, పెంచికల రామకృష్ణ, తాతిరెడ్డి వీరనారాయణరెడ్డి, శ్యామల వెంకటేశ్వర్లు, మురహరి నరసయ్య, కోటపాటి శేషయ్య, రమేష్‌, గంగిరెడ్డి, కూడలి దశరథ, గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-24T05:34:36+05:30 IST