ప్రజా స్వామ్యమా .. రౌడీ రాజ్యమా

Sep 17 2021 @ 23:58PM
నర్సాపురంలో నిరసన వ్యక్తం చేస్తున్న శ్వేతారెడ్డ్డి

చంద్రబాబు ఇంటిపై దాడిని ఖండించిన టీడీపీ నేతలు 

నర్సాపురంలో టీడీపీ నేతల నిరసన

మైదుకూరు, సెప్టెంబరు 17: మనం ప్రజాస్వా మ్యంలో ఉన్నామా లేక రౌడీ రాజ్యంలో ఉన్నా మా అనేది అర్ధం కావడంలేదని టీటీడీ  మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అనుమానం వ్య క్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై అధికార పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ దాడి చేయడం ఏమిటని దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని ఘాటుగా వి మర్శించారు.

శుక్రవారం రాత్రి ఆయన ఫొన్‌ద్వా రా విలేకరులతో మాట్లాడుతూ ప్రతి పక్ష పార్టీలు ఏమైనా ఆందోళనలు చేయాలంటే ముందస్తుగా హౌస్‌ అరెస్టులు చేస్తున్న ప్రభుత్వం జోగి రమేష్‌ దాడి చేస్తున్నట్లు ముందుగా ప్రకటించినా చర్య లు తీసుకోలేదని దుయ్యబట్టారు. జోగి రమేష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇకనై నా మారక పోతే తగిన మూల్యం చెల్లించు కోవా ల్సివస్తుందని ఆయన హెచ్చరించారు. 

నర్సాపురంలో నిరసన

కాశినాయన సెప్టెంబరు17: ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటిపై రౌడీమూకలతో దాడికి యత్నించి న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమే్‌షను పోలీసులు వెంటనే అరెస్ట్‌ చేయాలని కడప పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. నర్సాపురంలో సర్పంచ్‌ ఖాజావలితో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో ఉపసర్పంచ్‌ నాగేంద్రారెడ్డి, మాజీ సర్పంచ్‌ సుబ్బారెడ్డి, సీనియర్‌ టీడీపీ నేత శేషారెడ్డి పాల్గొన్నారు. మరో ప్రకటనలో కడప పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు  గురివిరెడ్డి ఖండించారు.

బద్వేలులో

బద్వేలు,సెప్టెంబరు17: చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌, ఆయన అనుచరు లు దాడిచేయడం అమానుషమని, నిందితులను అరెస్టుచేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ బాధ్యులు ఓబుళాపురం రాజశేఖర్‌ డి మాండ్‌ చేశారు. టీడీపీ కార్యాలయంలో విలేకర్ల తో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనను ముఖ్యమంత్రి జగన్‌ అసమర్థ పాలనపై అయ్యన్న పాత్రుడు  ప్రశ్నించడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  స్వయంగా జగన్‌మోహన్‌రెడ్డి కాల్చిచంపాలి, తన్నాలి అనే భాష వాడలేదా అని ఆయన గుర్తు చేశారు. బద్వేలు టీడీపీ అధ్యక్షుడు రవికుమార్‌రెడ్డి, పట్ట ణ అధ్యక్షుడు వెంగళరెడ్డి, అట్లూరు మండలాధ్యక్షుడు మ ల్లికార్జునరెడ్డి, కౌన్సిలర్‌ హసన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, జహంగీర్‌ బాష, దానం, ఐజయ్య, సర్పంచ్‌ రామచంద్రారెడ్డి, నగరప్రధాన కార్యదర్శి మహమ్మద్‌, సుబ్బారెడ్డి, పాల్గొన్నారు. 

చాపాడు, సెప్టెంబరు 17: మాజీ ముఖ్యమం త్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నివాసం పై వైసీపీ ఎమ్మెల్యే జ్యోగి రమేష్‌ దాడి చేయడం సమంజసం కాదని మండల టీడీపీ అధ్యక్షుడు అన్నవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. టీడీపీ అధికా రంలోకి రాగానే వైసీపీ నేతలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. 

ఫ దువ్వూరు, సెప్టెంబరు 17: చంద్రబాబు  నివాసంపై అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడిచేయడం ఓటమి భయమేనని  మండల టీడీపీ అధ్యక్షుడు పోరెడ్డి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఉంటూ వీధి రౌడీల్లా వ్యవహరించడం సరికాదన్నారు. నింది తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఫ ఖాజీపేట, సెప్టెంబరు 17: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంపై ఎమ్మెల్యే జోగి రమేష్‌ అనుచరుల తో దాడి చేయడం ప్రజా స్వామ్యంపై దాడి చేయడమేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసు బ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దుంపలగట్టు లోని స్వగృహం నుంచి ఆయన మాట్లాడుతూ   జడ్‌ప్లస్‌ కేటగి రి భద్రత కలిగి ఉన్న చంద్రబాబు ఇంటిపైనే దాడి చేస్తే ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ ఎక్కడని ప్రశ్నించారు.

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేతలు


దుంపలగట్టులో మాట్లాడుతున్న రెడ్యం


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.