ప్రభుత్వ పాఠశాలలే మేలు

Jul 22 2021 @ 23:09PM
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించిన సర్పంచ్‌

ఆదర్శంగా నిలచిన సర్పంచ్‌

గండీడ్‌, జూలై 22 : రుసుంపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆ గ్రామ సర్పంచు శిరీష తన ఇద్దరు పిల్లలను 1వ, 2వ తరగతుల్లో గురువారం చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య పిల్లల సమగ్ర వికాసాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ప్రభుత్వ బడిలో చదువుకున్న మహనీయులు చరిత్రలో ఎందరో ఉన్నారని తల్లిదండ్రులు అందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేష్‌, ప్రధానోపాధ్యాయుడు చంద్రకాంత్‌, ఉపాధ్యాయులు గోపాల్‌, నర్సింహారెడ్డి, కుర్మయ్య, యాదయ్య పాల్గొన్నారు.

Follow Us on: