కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు: మంత్రి సబితా

ABN , First Publish Date - 2022-04-05T02:08:54+05:30 IST

కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు చేస్తున్నామని విద్యా శాఖా

కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు: మంత్రి సబితా

హైదరాబాద్: కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు చేస్తున్నామని విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. నగరంలోని తారామతి బారాదరిలో తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 21-22 కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు వివిధ ఆవిష్కరణలు చేశారు. టాప్ 5 ఆవిష్కరణలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండేళ్లుగా కరోనాతో సతమతమవుతున్నా విద్యార్థులు ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారన్నారు. తెలంగాణా ఎన్నో రాష్ట్రాలకు దేశంలో ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు చేస్తున్న పిల్లల ప్రతిభ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్థుల్లాగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చి దిద్దుతున్నామన్నారు. పిల్లల భవిష్యత్తే తెలంగాణకు ముందడుగని మంత్రి అన్నారు.  కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, విద్యాశాఖ, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన హాజరయ్యారు. 

Updated Date - 2022-04-05T02:08:54+05:30 IST