టాయిలెట్స్‌ లుక్స్‌ అదుర్స్‌

ABN , First Publish Date - 2020-11-23T01:59:45+05:30 IST

పబ్లిక్‌ టాయిలెట్స్‌ అనగానే అబ్బో అస్సలు వెళ్లలేం. ఆ మాటే ఎత్తకండి అని చాలామంది పెదవి విరిచేస్తారు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ఇదే వరుస. అందుకే జపాన్‌ ప్రభుత్వం పబ్లిక్‌ టాయిలెట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ ఫోటో చూశారా...

టాయిలెట్స్‌ లుక్స్‌ అదుర్స్‌

పబ్లిక్‌ టాయిలెట్స్‌ అనగానే అబ్బో అస్సలు వెళ్లలేం. ఆ మాటే ఎత్తకండి అని చాలామంది పెదవి విరిచేస్తారు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ఇదే వరుస. అందుకే జపాన్‌ ప్రభుత్వం పబ్లిక్‌ టాయిలెట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ ఫోటో చూశారా... ఇందులో గాజు గదుల్లా ఉన్నవి ప్రజా మరుగుదొడ్లు. దివ్యాంగులు, మహిళలు, పురుషుల కోసం మూడు గదులు వేరు వేరుగా ఉన్నాయి. పారదర్శకమైన గాజువల్ల బయట నుంచే లోపల ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అంతా బయటికి కన్పిస్తుంటే ఎవరు వినియోగిస్తారనే అనుమానం వస్తుంది.


ఇక్కడే జపనీయులు తమ టెక్నాలజీని జోడించారు. ఈ మరుగుదొడ్లని ప్రత్యేకమైన గాజుతో రూపొందించడం విశేషం. ఎవరైనా లోపలికి వెళ్లి గడి పెట్టుకోగానే గాజు పారదర్శకతను కోల్పోతుంది. కాబట్టి గాజులే గోడల్లా మారి ఏమీ కన్పించకుండా చేస్తాయి. జపాన్‌ రాజధాని టోక్యోలో ఇటువంటి మరుగుదొడ్లను 17 చోట్ల నెలకొల్పారు. కొంత మంది చాలా అందమైన టాయిలెట్లు అని మెచ్చుకుంటుంటే మరికొందరేమో ఇంత ‘సీ త్రూ’ నా అని సందేహిస్తున్నారు. మరుగుదొడ్లంటేనే చీకటి, చిత్తడి అనే వాళ్లకు ఇవి బాగా నచ్చుతాయని, సృజనాత్మకమైన టాయిలెట్లను నిర్మించి జపాన్‌ ఆదర్శంగా నిలిచిందని అక్కడి అధికారులు గొప్పగా చెబుతున్నారు.

Updated Date - 2020-11-23T01:59:45+05:30 IST