డ్రైనేజీని పరిశీలిస్తున్న కమిషనర్
కమిషనర్ ప్రవీణ్ చంద్
కడప(ఎర్రముక్కపల్లి), జూన 28 : కడప నగరంలో పబ్లిక్ టాయిలెట్స్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ ప్రవీణ్ చంద్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. నగరంలో మం గళవారం మార్నింగ్ విజిట్‌లో భాగంగా నాగరాజుపేట, కోఆపరేటీవ్ కాలనీ ప్రాంతాలను సంబంధిత కార్పొరేటర్ వారి తో కలిసి తనిఖీ చేశారు. నాగరాజుపేట బుగ్గవంక ప్రాం తాల్లో చెత్తను ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అ నంతరం కోఆపరేటివ్ కాలనీ నెహ్రూ పార్క్‌ను తనిఖీ చేశారు. పార్క్ మె యింటెన్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్కులో గల బాత్రూమ్లు, తాగునీటి సరఫరాల్లో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పలు ప్రాంతాల్లో గల పబ్లిక్ టాయిలెట్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభా గం, హెల్త్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.