ప్రజా సంక్షేమం పట్టని వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-09-25T06:41:23+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ఎంత దోచుకోవాలి, ఎంత దాచుకోవాలని తప్ప, ప్రజా సంక్షేమం పట్టడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ అన్నారు.

ప్రజా సంక్షేమం పట్టని వైసీపీ ప్రభుత్వం
కొవ్వూరులో ప్రజా పోరుయాత్ర ప్రారంభిస్తున్న రాధాకృష్ణ

  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ 
  • పలుచోట్ల ప్రజా పోరుయాత్ర

కొవ్వూరు, సెప్టెంబరు 24: వైసీపీ ప్రభుత్వం ఎంత దోచుకోవాలి, ఎంత దాచుకోవాలని తప్ప, ప్రజా సంక్షేమం పట్టడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ అన్నారు. శనివారం కొవ్వూరు విజయవిహార్‌ సెంటర్‌లో వైసీపీ అభివృద్ధి నిరోధక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా పోరుయాత్ర  చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌రెడ్డి ప్రభుత్వం సంక్షే మం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందన్నారు. భావితరాల్లో ప్రతిఒక్కరి తలపై రూ.2 లక్షలకు పైగా అప్పు మిగిల్చిందన్నారు. 3 రాజధానుల పేరుతో ఏపీని ఎక్కడా రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారన్నారు. ప్రధాని ఆవాస యోజన కింద ఇంటి నిర్మాణానికి రూ. 1.80 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుం టే, కనీస వసతులు లేని భూమిని కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారన్నారు. కోరుకొండలో ఆవ భూములను సేకరిస్తే కోర్టుకు వెళ్లి నిలుపుదల చేశార న్నారు. ప్రధాని అన్న యోజన కింద ప్రజలందరికి బియ్యం పంపిణీ చేస్తుంటే వైసిపి ప్రభుత్వం నాలుగు నెలలుగా బియ్యం నిలుపుదల చేయడంపై ఆగ్ర హం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని తాత, తండ్రుల పేర్లు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. 3 యూనిట్లు రూ.1500 ఉన్న ఇసుకను టీడీపీ రూ.6 నుంచి రూ.10 వేలు చేస్తే, జగన్‌ ప్రభుత్వం రూ.15 వేలుకు పెం చిందన్నారు. మద్య నియంత్రణ అంటూ రేట్లు పెంచి సామాన్యులను దోచుకుంటున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశంలో 138 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న బీజేపీకి రాష్ట్రంలో అధికారం అందించాలన్నారు. కార్యక్రమంలో భూసి బెనర్జి, పిక్కి నాగేంద్ర, కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ, బోడపాటి ముత్యాలరావు, పెరుగు పోతురాజు, నీరుకొండ సూర్యనారాయణ, గెల్లా కేశవ, తాడిమళ్ల విజయవాణి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-25T06:41:23+05:30 IST