ప్రజాసంక్షేమం టీఆర్‌ఎ్‌సది.. కపట పాలన బీజేపీది

ABN , First Publish Date - 2022-06-29T05:30:00+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతూ నాలుగున్నర కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కపటపాలన సాగిస్తూ సామాన్యుడు జీవించలేని పరిస్థితి తీసుకొచ్చిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.

ప్రజాసంక్షేమం టీఆర్‌ఎ్‌సది.. కపట పాలన బీజేపీది
కడవేరుగు గ్రామశివారులో వంతెన నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల, జూన్‌ 29: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతూ నాలుగున్నర కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కపటపాలన సాగిస్తూ సామాన్యుడు జీవించలేని పరిస్థితి తీసుకొచ్చిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. చేర్యాల మండలం కడవేరుగు గ్రామశివారులో రూ.10 లక్షలతో తాత్కాలికంగా చేపట్టనున్న వంతెన నిర్మాణంతో పాటు చుంచనకోట గ్రామంలో రూ.12 లక్షలతో చేపట్టనున్న కురుమ సంఘ భవనానికి భూమిపూజ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ కార్యదక్షతతో దేశంలోనే అత్యంత ఉత్తమమైన పాలన సాగిస్తూ ఆదర్శంగా నిలిచిన ఏకైక రాష్ట్రం తెలంగాణయేనన్నారు. 

మూత్రశాల ఆవరణ శుభ్రం చేసిన ఎమ్మెల్యే

చుంచనకోట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సందర్శించారు. మూత్రశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉండి దుర్గంధం వెదజల్లుతుండటంతో నీటితో శుభ్రం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలోని పిచ్చిమొక్కలను తొలగింపజేశారు. 

చుంచనకోట సర్పంచ్‌, ఇతర నేతల అరెస్ట్‌

చేర్యాల, జూన్‌ 29: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పర్యటన సందర్భంగా చేర్యాల పోలీసులు బుధవారం చుంచనకోట సర్పంచ్‌ ఆది శ్రీనివాస్‌, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి సుతారి రమేష్‌, ఇతర కాంగ్రెస్‌ నాయకులను ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ గిరి కొండల్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వకుళాభరణం నర్సయ్యపంతులు, సర్పంచ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ పోలీసుల తీరును ఖండించారు. కాగా అక్రమ అరె్‌స్టను రెవెన్యూ డివిజన్‌ జేఏసీ నాయకులు చక్రధర్‌, రాజు, రాకేశ్‌కృష్ణన్‌, జానకీస్వామి తదితరులు ఖండించారు. 

Updated Date - 2022-06-29T05:30:00+05:30 IST