అర్హులందరికీ పక్కా గృహాలు

ABN , First Publish Date - 2022-05-20T05:28:45+05:30 IST

అర్హులందరికి ప్రభు త్వం ఇంటి స్థలంతో పాటు పక్కా గృహాలు మంజూరుచేస్తున్నట్టు శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచి న కృష్ణచైతన్య చెప్పారు.

అర్హులందరికీ పక్కా గృహాలు
దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్‌లను పంపిణీ చేస్తున్న శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య

శాప్‌నెట్‌ చైర్మన్‌  కృష్ణచైతన్య

బల్లికురవ, మే 19: అర్హులందరికి ప్రభు త్వం ఇంటి స్థలంతో పాటు పక్కా గృహాలు మంజూరుచేస్తున్నట్టు శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచి న కృష్ణచైతన్య చెప్పారు. గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో 265 మం ది లబ్ధిదారులకు పక్కా గృహాల  మంజూరు పత్రాలను అందజేశారు. 42 మంది దివ్యాం గులకు సదరం సర్టిఫికెట్‌లను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడు తూ నివేశన స్థలాలు పొందిన లబ్ధిదారులు వెంటనే గృహ నిర్మాణాలు చేపడితే ప్రభు త్వం బిల్లులు చెల్లిస్తుందన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హు లందరికి అందేలా చర్యలు చేపడ తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బడుగు శ్రీలక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్‌ అశోక్‌ వర్ధన్‌, వైసీపీ నేతలు చింతల శ్రీనివాస రావు, ఇప్పల సుబ్బారెడ్డి, మాదాల శివన్నారాయణ, షేక్‌ శ్రీనువలి, నరేష్‌, ఏల్చూరి హరిబాబు తదిత రులు పాల్గొన్నారు.


మౌలిక వసతుల  కల్పనపై దృష్టి

అద్దంకి, మే 19: గ్రామాలలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌ చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. మండలంలోని కలవకూరు పంచా యతీ పరిధిలో గుర్రంవారిపాలెంలో గురువారం సైడ్‌ డ్రైన్‌ల నిర్మాణా నికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులను  అడిగి సమస్యలు తెలుసుకున్నారు.

Updated Date - 2022-05-20T05:28:45+05:30 IST