పక్కా వ్యూహం !

ABN , First Publish Date - 2021-11-15T06:10:57+05:30 IST

పెను కొండ నగర పంచాయతీ ఎన్నికల్లో గెలవటానికి అధికార పార్టీ పక్కా వ్యూహంతో ప్రలోభాలకు తెరలేపినట్టు స్ప ష్టమవుతోంది.

పక్కా వ్యూహం !

పెనుకొండ నగర పంచాయతీ 

ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలు

దొంగ ఓట్లు వేయించేందుకు సమాయత్తం

చిత్తూరు నుంచి ఓటర్ల దిగుమతి

పెనుకొండలోని వివిధ ప్రాంతాల్లో మకాం

అర్ధరాత్రి వరకూ యథేచ్ఛగా డబ్బులు, చీరలు పంపిణీ

ఇతర ప్రాంతాల నాయకుల కనుసన్నల్లోనే వ్యవహారం

స్థానిక వైసీపీ నేతల్లో  తీవ్ర అసంతృప్తి

మైనార్టీలకే చైర్మన పదవి అన్న టీడీపీ 

జరుగుతున్న పరిణామాలతో పునరాలోచనలో ఓటర్లు

నేడు నగర పంచాయతీ ఎన్నికలు  

అనంతపురం,నవంబరు14(ఆంధ్రజ్యోతి): పెను కొండ నగర పంచాయతీ ఎన్నికల్లో గెలవటానికి  అధికార పార్టీ పక్కా వ్యూహంతో ప్రలోభాలకు తెరలేపినట్టు స్ప ష్టమవుతోంది. శనివారం సాయంత్రం నుంచే ఓటుకు నో టుతో పాటు చీర, జాకెట్టు పంపిణీ చేశారు.  ప్రజా ప్రతి నిధులే ఈ పంపిణీలో భాగస్వాములు కావడంతో వారిని స్థానికులు నిలదీసిన వీడియోలు సామాజిక మాధ్యమా ల్లో వైరల్‌ అయ్యాయంటే ప్రలోభాల పరంపర ఎంత జో రుగా సాగిందో  అర్థమవుతుంది.  ఇతర ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, నాయకులకే ‘పంపిణీ’ బాధ్యతలు అప్పగించి న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధికి తమపై నమ్మకం లేదా అని సొంత పార్టీ స్థానిక నేతలు అసంతృప్తితో రగిలి పోతున్నట్లు సమాచారం.  ఎన్నికల నోటిఫికేషన వెలువ డిన నాటినుంచే వైసీపీ అభ్యర్థులకు ఓటేయకపోతే మీ సంక్షేమ పథకాలు రద్దవుతాయనే భయాన్ని వలంటీర్లు, మహిళా సంఘాల ద్వారా ఆ పార్టీ నేతలు చెప్పించారనే ఆరోపణలున్నాయి. ఈ పరిణామాలపై పోలీసు యంత్రాం గం ప్రేక్షక పాత్ర వహిస్తుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 


దొంగ ఓట్లు వేయించేందుకు వ్యూహం 

దొంగ ఓట్లు వేయించేందుకు కూడా అధికార పార్టీ పక్కా వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఒక నగర పంచాయతీ ఎన్నికపై ఇంతగా దృష్టి పెట్టడా నికి ప్రధాన కారణం లేకపోలేదు. రెండున్నరేళ్ల పాలనలో  ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న విమర్శలు స్థానిక ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏ విధం గానైనా పెనుకొండ కోటలో పాగా వేయాలన్న తలంపుతో వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఇదివరకూ చంద్రగిరిలో జరిగిన ఫా ర్మూలానే పెనుకొండ ఎన్నికల్లోనూ ఉపయోగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారితో దొంగ ఓట్లు వేయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్తూరు జిల్లాకు చెందిన వందలాది మందిని పెనుకొండలోని వివిధ ప్రాంతాల్లో మకాం వేయించినట్లు  సమాచారం.  పెనుకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారిని ఉంచారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఈ వ్యవహార మంతా కొనసాగుతున్నట్లు సమాచారం. 


మారుతున్న ఓటర్ల ఆలోచన !

పెనుకొండ నగర పంచాయతీలో మారుతున్న రాజకీ యాల నేపథ్యంలో స్థానిక ఓటర్లు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి చేసిన ప్రకటన మైనార్టీ వర్గాలను ఆలోచనలో పడేసింది. టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే మైనార్టీ అభ్యర్థినే చైర్మనగా నియమిస్తామని ఆయన రెండ్రోజుల క్రితమే ప్రకటించా రు. మొదటి రెండున్నర సంవత్సరాలు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తే చైర్మనగా కొనసాగుతారని చెప్పుకొచ్చారు. దీంతో మైనార్టీ వర్గాలు ఆలోచనలో పడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయల ఉ త్సవాలను నిర్వహించకపోవడంతో స్థానికుల్లో ముఖ్యంగా బలిజ సామాజికవర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.  ఈక్రమంలో బలిజ కులస్థులు వైసీపీకి ఓటు విషయంలో  పునరాలోచిస్తారనే విషయంలో సందేహం లేదు.  వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో పెనుకొండలో ఎలాంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టలేదన్న విమర్శలు స్థానికుల నుం చి వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నా పెనుకొండ పట్టణాభివృద్ధికి ఎలాంటి కృషి జరగలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యం లో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలో రగిలిపోతున్నారు. మరీ ఓటు విషయంలో స్థానిక ప్ర జలు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో వేచి చూడాల్సిందే. 


అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేసేందుకు టీడీపీ రెడీ 

పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ అంటోంది. ప్రజాస్వామ్యబద్ధంగా, ఎన్నికల కమిషన నిబం ధనల మేరకు ఎన్నికలు జరగాలని ఆ పార్టీ కోరుకుంటోం ది. అలాకాకుండా అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టారీ తిలో అక్రమాలకు పాల్పడితే వాటిని ధీటుగా ఎదుర్కొనేం దుకు టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని  బీకే పార్థ సారథి స్పష్టం చేస్తున్నారు.  పెనుకొండ నగర పంచా యతీ ఎన్నికల పోలింగ్‌ సోమవారం జరుగుతున్న నేప థ్యంలో అవసరమైన అన్ని భద్రతా చర్యలను జిల్లా పోలీసు యంత్రాంగం తీసుకుంటోంది. 


నేడు పెనుకొండ నగర పంచాయతీ పోలింగ్‌ 

ఏర్పాట్లు పూర్తి

పెనుకొండ, నవంబరు 14: పెనుకొండ నగర పం చాయతీకి తొలిసారిగా సో మవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, సబ్‌ కలెక్టర్‌ నవీన తెలిపారు.  ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు.  20,560 మంది ఓటర్లు  ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు తెలిపారు. మొత్తం 20బ్లాక్‌లకు 22పోలింగ్‌ కేంద్రాలను ఏ ర్పాటు చేసినట్టు వెల్లడించారు. పోలింగ్‌ నిర్వహణకు 27 మంది పీఓలు, 27మంది ఏపీఓలు ఇతరులు 77మంది, మై క్రో అబ్జర్వర్లను 22మందిని నియమించామన్నారు.  

Updated Date - 2021-11-15T06:10:57+05:30 IST