చైతన్య సూరీడు

ABN , First Publish Date - 2022-05-19T05:49:10+05:30 IST

అతడు– చైతన్యం మేమంతా జీవన చిత్రాలం వారు సూరీడు మేమంతా నక్షత్రాలం ఆయన వెలుతురు సోకి

చైతన్య సూరీడు

అతడు– చైతన్యం

మేమంతా జీవన చిత్రాలం

వారు సూరీడు

మేమంతా నక్షత్రాలం

ఆయన వెలుతురు సోకి

మిణుకుమనే గ్రహాలం

ఆయనొక సామాజిక భగవద్గీత

మేమంతా జవాబులు


వెతుకుతున్న సమస్యలం

అతడు చనిపోయినా

వర్షిస్తున్న మేఘం

మేము మాలోనే


ప్రాణాల్ని దాచుకున్న విత్తనాలం

ఆ చినుకు కురిస్తే–

కృతజ్ఞతలుగా మొలకెత్తే అభిమాన పతాకలం

వారి ఉద్యమం ఒక జీవన విధానం

వారి పోరాటాలు – నేటి సంస్కృతిలో భాగం

గమనాన్నీ గమ్యాన్నీ లిఖించుకున్న నిర్దేశకుడు

అందుకే సుందరయ్యకు

ఈ బతికిన కృతి బహుకృతి

నిలువెత్తు అక్షర హారతి


– ఈతకోట సుబ్బారావు

(నేడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి)

Updated Date - 2022-05-19T05:49:10+05:30 IST