పుదీనా పోహా

ABN , First Publish Date - 2021-05-28T14:33:11+05:30 IST

మందపాటి అటుకులు- మూడు కప్పులు, ఉల్లి గడ్డ- 1 , టమోటా- రెండు, క్యారట్‌, కాలీఫ్లవర్‌, క్యాప్సికమ్‌ ముక్కలు - ఓ కప్పు, పసుపు- అర స్పూను, ఉప్పు- తగినంత, పుదీనా- ఓ కట్ట, కొత్తిమీర తురుము-

పుదీనా పోహా

కావలసిన పదార్థాలు: మందపాటి అటుకులు- మూడు కప్పులు, ఉల్లి గడ్డ- 1 , టమోటా- రెండు, క్యారట్‌, కాలీఫ్లవర్‌, క్యాప్సికమ్‌ ముక్కలు - ఓ కప్పు, పసుపు- అర స్పూను, ఉప్పు- తగినంత, పుదీనా- ఓ కట్ట, కొత్తిమీర తురుము- సగం కప్పు, కరివేపాకు- రెండు రెబ్బలు, పచ్చి మిర్చి- నాలుగు, పోపు గింజలు- స్పూను.


తయారుచేసే విధానం: ముందుగా అటుకుల్ని నీళ్లలో కడుక్కుని పక్కన బెట్టాలి. పుదీనా, కరివేపాకు, మిర్చి ముక్కల్ని గ్రైండర్‌లో మెత్తగా నూరిపెట్టుకోవాలి. ఓ పాన్‌లో నూనె వేసి, కాగాక పోపు గింజలు చిటపటలాడించాలి. ఇందులోనే ఉల్లిముక్కలు వేసి దోరగా వేగాక టమోటా ముక్కలు, మిగతా కూరగాయ ముక్కల్ని వేసి వేయించాలి. పసుపు, ఉప్పునూ చేర్చాలి. దీనికి పుదీనా రుబ్బునూ వేసి కలపాలి. ఆ తరవాత అటుకుల్ని వేసి బాగా కలిపి ఓ అయిదు నిమిషాలు ఉడికించాలి. పైన కొత్తిమీర తురుమును వేసి దించితే పుదీనా పోహా రెడీ.

Updated Date - 2021-05-28T14:33:11+05:30 IST