క్షేత్రపాలకుడు ఆంజనేయుడికి ఆకుపూజ

ABN , First Publish Date - 2020-12-02T06:04:56+05:30 IST

యాదాద్రి టౌన్‌, డిసెంబరు 1: యాదాద్రి టౌన్‌, డిసెంబరు 1: ్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజా పర్వాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.

క్షేత్రపాలకుడు ఆంజనేయుడికి ఆకుపూజ
గుట్టలో ఆంజనేయస్వామి పూజ నిర్వహిస్తున్న అర్చకుడు,


కార్తీక దీపారాధనలు 

యాదాద్రి టౌన్‌, డిసెంబరు 1: యాదాద్రి టౌన్‌, డిసెంబరు 1: యాదాద్రి టౌన్‌, డిసెంబరు 1: ్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజా పర్వాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. కొండపైన విష్ణు పుష్కరిణి చెంత, అను బంధ  పాతగుట్ట ఆలయంలోని ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ అర్చకులు వేద మంత్ర పఠనాలతో పంచామృతాభిషేకం నిర్వహించారు. సింధూరం, వివిధ రకాల పూలమాలలతో అలంకరించి నాగవళ్లి దళాలతో అర్చించారు. ఆంజ నేయ స్వామికి మహా ప్రసాదం నివేదన చేసి హనుమంతుడి ప్రతిరూపమైన వానరాలకు అరటి పండ్లను ఆహారంగా అందజేశారు. బాలాలయంలో కవచ మూర్తులను అభిషేకం, అర్చనలు నిర్వహించి హోమం, నిత్యతిరుకల్యాణ వేడుకలు జరిపారు. కొండపైన చరమూర్తుల ఆలయంలో నిత్యపూజలు వ్రత మండపంలో సత్యదేవుడి వ్రతారాధనలు శైవ సంప్రదాయరీతిలో జరిగాయి. పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని మహిళా భక్తులు హరిహరుల ఆలయాల్లో దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామికి మంగళవారం భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.8,89,458ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. 

వైభవంగా అనంతపద్మనాభ స్వామి కల్యాణం

 వైభవంగా అనంతపద్మనాభ స్వామి కల్యాణం

తుర్కపల్లి: మండలంలోని తిర్మాలాపూర్‌, వీరారెడ్డిపల్లి, పీర్లపల్లి గ్రా మాల సరిహద్దుల్లో  అంజన్నగట్టుపై  ఉన్న శవకేశవస్వామి ఆలయంలో పార్వతీపరమేశ్వరులు, భూదేవి, శ్రీదేవి సహిత అనంతపద్మనాభస్వామి కళ్యాణోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ సన్నీధిలో హోమాలు నిర్వహించిన అనంతరం ఒకే వేదికపై ఏక కాలంలోనే పార్వతీపరమేశ్వర్లు, శ్రీదేవి, భూదేవి సహిత అనంతపద్మనాభస్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులు ఒడి బియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. మండల పరిసర గ్రామాల ప్రజలతోపాటు సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ పీర్లపల్లి గ్రామాల నుంచి భక్తులు కల్యాణోత్స వాన్ని తిలకించడానిక పెద్ద ఎత్తున హాజరయ్యారు.  ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనావత్‌ బీకునాయక్‌,  బీర్ల ఫౌండేషన్‌ చైర్మన్‌ బీర్ల ఐలయ్య, ఆలేరు మాజీ మార్కెట్‌ చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌, అభయాంజనేయస్వామి ఆలయ ట్రస్టు సభ్యుడు పి.వెంకట్‌రెడ్డి, వీరంతల గోవిందచారి, పి.జనార్ధన్‌రెడ్డి, వీరారెడ్డిపల్లి సర్పంచ్‌ జక్కుల శ్రీవాణి, ఎంపీటీసీ కానుగంటి శ్రీనివాస్‌యాదవ్‌ ఉన్నారు.

వంకమామిడిలో ముత్యాలమ్మ పండుగ 

భూదాన్‌పోచంపల్లి : భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోనరి వంకమామిడి గ్రామంలో మంగళవారం ముత్యాలమ్మదేవాలయంలో 16 రోజుల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీసీసీ ఉపాధ్యక్షుడు సామ మధుసూదన్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సామ మోహన్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు సామ రవీందర్‌రెడ్డి హాజరుకాగా, కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ బొడిగె శంకరయ్యగౌడ్‌, ఉపసర్పంచు జింక జంగయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T06:04:56+05:30 IST