
ఎవరా భామ అనుకుంటున్నారా? ఇంకెవరూ నికిషా పటేల్ గురించే ఈ ముచ్చట. పవన్‌కల్యాణ్ ‘పులి’ సినిమాతో పరిచయమైన నికిషా ఆ తరువాత అవకాశాలు రాక లేక పిల్లి పిల్లగా మారిపోయింది. ఇక్కడ ఎంతగా ప్రయత్నించినా ఫలితం ఉండకపోవడంతో బ్రిటన్ వెళ్ళిపోయింది. అక్కడ నుంచి హాలీవుడ్ సినిమాలలో ప్రయత్నించాలని భావిస్తోందట! ఇక్కడ ఎంతకాలం వెయిట్ చేసినా ఎలాంటి అవకాశాలురాలేదనీ, ఇంకా ఇక్కడే ఉంటే కెరీర్‌కు చరమ మంగళం పాడాల్సి వస్తుందని భావించి హాలీవుడ్ బాటపట్టిందట!
మిగతా హీరోయిన్ల కన్నా ఎక్స్‌పోజింగ్‌లో ఓ అడుగు ముందే ఉన్నా, నటన విషయంలో మాత్రం అందరికన్నా వెనుకపడే ఉంది. అందుకే ఇక్కడ ఆమెకు అవకాశాలు రావడం లేదట! టాలెంట్ ఉంటే ఎక్కడయినా నెగ్గుకురాగలరు కదా...ఈ విషయాన్ని మరిచిపోయి నికిషా ప్రవర్తిస్తోందనీ సినీ జనాలంటున్నారు.