వెంచరామి గుట్టల సమీపంలో పులి పాదముద్రలు

ABN , First Publish Date - 2022-07-02T06:37:48+05:30 IST

వెంచరామి గుట్టల సమీపంలో పులి పాదముద్రలు

వెంచరామి గుట్టల సమీపంలో పులి పాదముద్రలు
పెద్దపులి జాడకోసం అన్వేషిస్తున్న అటవిశాఖ అధికారులు

 ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారుల సూచన

కాకతీయఖని, జూలై 1 : ఆరు రోజులుగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లో సంచరిస్తున్న పెద్దపులి పాదముద్రలను శుక్రవారం చిట్యాల మండలం వెం చరామి గుట్టల సమీపంలో గుర్తించిన ట్లు చెల్పూరు అటవిశాఖ రేంజ్‌ అధికారి నాగరాజు తెలిపారు. అందుకుతండా, రాఘవపూర్‌ ఎర్రచెరువు, కాల్వపల్లి, కుర్మపల్లి మీదుగా వెంచరామి గుట్టల సమీపంలోకి పులి చేరుకుందని వెల్లడించారు. అయితే శనివారం వరకు కొయ్యూరు, భూపాలపల్లి రేంజ్‌ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే చుట్టుపక్కల గ్రామాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్దపులికి హాని తలపెట్టకుండా ప్రజలను అవగాహ న కల్పించాలని ప్రజాప్రతినిధులను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవిశాఖ బీట్‌ అధికారులు విజయ, పురుషోత్తం, బేస్‌క్యాంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:37:48+05:30 IST