సీఎం ఇలాకా Pulivendulaలో దారుణం..

ABN , First Publish Date - 2022-05-08T14:41:42+05:30 IST

పులివెందుల బ్రహ్మణపల్లెలోని సీఎం ఇలాకాలో దారుణం చోటు చేసుకుంది. ఎంపీపీ స్కూల్లో 3వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు

సీఎం ఇలాకా Pulivendulaలో దారుణం..

కడప: పులివెందుల బ్రహ్మణపల్లెలోని సీఎం ఇలాకాలో దారుణం చోటు చేసుకుంది. ఎంపీపీ స్కూల్లో 3వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు గురి చేశాడు. బాలికల పట్ల ఉపాధ్యాయుడు శివశంకర్ అసభ్య ప్రవర్తించాడని విద్యార్థినులు చెబుతున్నారు. తరగతి గదిలోకి పిలిపించుకుని ఉపాధ్యాయుడి వెకిలిచేష్టలు చేసేవాడని, విద్యార్థినులతో ఇష్టానుసారం ప్రవర్తించేవారని తెలిపారు. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై పిల్లలు తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు శివశంకర్‎ని పోలీసులు అరెస్ట్ చేసి పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశారు. 

Read more