Imprisonment: పల్మనాలజిస్ట్ విజయ్‌భాస్కర్‌కు పదేళ్ల జైలుశిక్ష

ABN , First Publish Date - 2022-08-10T19:49:09+05:30 IST

ప్రముఖ పల్మనాలజిస్ట్ విజయ్‌భాస్కర్‌కు నాంపల్లికోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది.

Imprisonment: పల్మనాలజిస్ట్ విజయ్‌భాస్కర్‌కు పదేళ్ల జైలుశిక్ష

హైదరాబాద్: ప్రముఖ పల్మనాలజిస్ట్ విజయ్‌భాస్కర్‌ (Vijaybhaskar)కు నాంపల్లికోర్టు(Nampalli court) పదేళ్ల జైలుశిక్ష విధించింది. 2016లో తన క్లినిక్‌కు వచ్చిన పేషెంట్‌తో విజయ్‌భాస్కర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఇతర పేషెంట్లపై కూడా వైద్యుడు అదే రీతిలో వ్యవహరించాడు. 2016లో గోపాలపురం పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... చార్జ్‌షీట్ దాఖలు చేసి సరైన ఆధారాలు సమర్పించారు. దీంతో వైద్యుడికి నాంపల్లి కోర్టు పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించింది. 

Updated Date - 2022-08-10T19:49:09+05:30 IST