గుమ్మడికాయ సూప్

ABN , First Publish Date - 2021-12-04T18:52:35+05:30 IST

పసుపు రంగు గుమ్మడికాయ - అరకేజీ, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - రెండు, వేగించిన జీలకర్ర - పావుటీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కరివేపాకు - ఒక కట్ట.

గుమ్మడికాయ సూప్

కావలసినవి: పసుపు రంగు గుమ్మడికాయ - అరకేజీ, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - రెండు, వేగించిన జీలకర్ర - పావుటీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కరివేపాకు - ఒక కట్ట.


తయారీ విధానం: గుమ్మడికాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత కుక్కర్‌లో వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి, రెండు కప్పుల నీళ్లు పోసి పదినిమిషాల పాటు ఉడికించాలి. కుక్కర్‌లో ఆవిరి పోయిన తరువాత తీసి మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. ఈ సూప్‌ని మళ్లీ పాన్‌లో తీసుకుని స్టవ్‌పై పెట్టి మరిగించాలి. కరివేపాకు వేసి దింపుకోవాలి. వేడివేడిగా తీసుకుంటే గుమ్మడికాయ సూప్‌ రుచిగా ఉంటుంది.

Updated Date - 2021-12-04T18:52:35+05:30 IST