విడాకుల కేసులో షాకింగ్ తీర్పు.. భర్తకు ప్రతీ నెలా రూ.25 వేలు భరణం చెల్లించాలంటూ భార్యకు ఆదేశాలు..!

Published: Sat, 25 Jun 2022 18:44:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విడాకుల కేసులో షాకింగ్ తీర్పు.. భర్తకు ప్రతీ నెలా రూ.25 వేలు భరణం చెల్లించాలంటూ భార్యకు ఆదేశాలు..!

కొన్ని కుటుంబాల్లో పెళ్లయిన కొత్తలో సమస్యలు తలెత్తితే.. మరికొన్ని కుటుంబాల్లో పిల్లలు పుట్టిన తర్వాత.. దంపతుల మధ్య విభేదాలు తలెత్తుతుంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతుల పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. 83ఏళ్ల వయసులో ఉన్న వృద్ధుడికి.. భార్య నుంచి వేధింపులు మొదలయ్యాయి. రోజురోజుకూ ఎక్కువవడంతో చివరకు కోర్టును ఆశ్రయించాడు. విచారించిన న్యాయస్థానం.. భర్తకు ప్రతి నెలా రూ.25వేలు చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని పూణేకు చెందిన అశోక్(83), లత(78)(పేర్లు మార్చాం)కు 1964లో వివాహమైంది. వారి ఇద్దరి కుమార్తెలకు కూడా వివాహం అయింది. అశోక్ విద్యా సంస్థను నిర్వహిస్తున్నాడు. అతడి భార్య అందులో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. వీరి మధ్య లేటు వయసులో సమస్యలు వచ్చి పడ్డాయి. అశోక్ ప్రస్తుతం మధుమేహం, గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. భర్తను బాగా చూసుకోవాల్సింది పోయి.. అతన్ని రోజురోజుకూ నిర్లక్ష్యం చేసేది. చివరకు భర్తను ఇంటి నుంచి బయటికి వెళ్లగొట్టాలని కూడా ప్రయత్నించింది. గొడవలు ఎక్కవ అవడంతో 2019లో ఇద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

న్యాయం చేయండంటూ రెండు చేతులూ లేని బాలిక కాళ్లతో రాసిందో లేఖ.. నేరుగా ఇంటికే వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి..

ఈ కేసులో ఇటీవల న్యాయస్థానం సంచలన తీర్చు ఇచ్చింది. భర్తకు ప్రతి నెలా రూ.25వేలు చెల్లించాలంటూ తీర్చు వెలువరించింది. భర్తకు భార్య ఇంత పెద్ద మొత్తంలో భరణం ఇవ్వాలని ఆదేశించడం రాష్ట్రంలో ఇదే మొదటి కేసు అని న్యాయవాది తెలిపారు. భార్య సంపాదిస్తూ.. అదే క్రమంలో భర్తకు ఆదాయ వనరు లేకపోతే, గొడవలు జరిగిన క్రమంలో భర్త కూడా హిందూ వివాహ చట్టం ప్రకారం భరణం కోసం దావా వేయవచ్చని పేర్కొన్నాడు. బాధితుడు అశోక్ మాట్లాడుతూ.. తన భార్యకు ఆరోగ్యం సరిగా లేని సమయంలో తాను బాగా చూసుకున్నానని, ఆరోగ్యం నయమయ్యాక తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

40 ఏళ్ల వయసులో ఇదేం పోయేకాలం.. 14 ఏళ్ల బాలిక తండ్రికి రూ.30 వేలు ఇచ్చిమరీ..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Viral Video: పిల్లలను రోడ్డు దాటించడంలో.. ఈ గొరిల్లా ఎంత జాగ్రత్త తీసుకుంటుందో.. చూస్తే ఆశ్యర్యం కలుగుతుంది..videoరూ.80 లక్షల జీతాన్నిచ్చే జాబ్‌కు గుడ్‌బై.. సొంతూరికి తిరిగొస్తే.. ఇదేం పిచ్చి పని అన్నవాళ్లే ఇప్పుడు అతడి సంపాదన చూసి..Viral Video: పాముతో చెలగాటం ఆటాడు.. చివరికి చుక్కలు చూపించింది.. ఏం జరిగిందో మీరే చూడండి..videoసద్గురు జగ్గీ వాసుదేవ్ నోట.. గంగవ్వ మాట.. మట్టి ప్రాముఖ్యత తెలియజేస్తూ... ఆయన ఏమన్నారంటే..videoతల్లి ఫోన్లో వీడియోను చూసి తానూ అలా చేయాలనుకున్నాడు.. పదేళ్ల పిల్లాడి మృతి కేసులో షాకింగ్ నిజాలు..!AIDS ఉన్న విషయం దాచి ఓ యువతిని పెళ్లి చేసుకున్న యువకుడు.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటంటే..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.