కొవిడ్ రోగులకు ఒక్క ట్యాబ్లెట్ కూడా ఇవ్వకుండానే రూ. 5.26 కోట్ల బిల్లు!

ABN , First Publish Date - 2021-02-15T01:49:51+05:30 IST

ఓ ఆసుపత్రి చేసిన నిర్వాకం బయటకు వచ్చి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. కొవిడ్ రోగులకు

కొవిడ్ రోగులకు ఒక్క ట్యాబ్లెట్ కూడా ఇవ్వకుండానే రూ. 5.26 కోట్ల బిల్లు!

పూణె: మహారాష్ట్రలోని పూణెలో ఓ ఆసుపత్రి చేసిన నిర్వాకం బయటకు వచ్చి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. కొవిడ్ రోగులకు చికిత్స చేయకుండానే చేసినట్టు బిల్లులు సృష్టించిన పూణెలోని స్పర్శ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఏకంగా రూ. 5.26 కోట్ల బిల్లు సమర్పించింది. దీంతో అవాక్కయిన అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో అసలా ఆసుపత్రి ఒక్క రోగికి కూడా చికిత్స చేయలేదని తేలింది. ఆ ఆసుపత్రికి రెండు సెంటర్లు ఉండగా, ఒక్కదాంట్లో కూడా ఒక్క రోగికి కూడా చికిత్స అందించలేదని, ఒక్క ట్యాబ్లెట్ ఇచ్చిన పాపాన కూడా పోలేదని తెలిసి అందరూ అవాక్కయ్యారు.


దీంతో ఈ బిల్లుల వెనకున్న గూడుపుఠాణీని తెలుసుకునేందుకు పింప్రి-చించ్వాడ్ మునిసిపాలిటీ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. కేసు దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఆసుపత్రి సమర్పించిన రూ. 5.26 కోట్ల బిల్లులో ఇప్పటికే రూ.3.29 కోట్లు చెల్లించేశారు. మిగతా సొమ్ము చెల్లింపు మాత్రం దర్యాప్తులో తేలినదానిని బట్టి ఉంటుందని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-02-15T01:49:51+05:30 IST