విడిపోయిన భార్యను ఇంటికి రప్పించేందుకు భర్త ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2020-10-08T16:14:54+05:30 IST

తన నుంచి విడిపోయి పుట్టింట్లో ఉంటున్న తన భార్యను తిరిగి ఇంటికి రప్పించేందుకు కన్న కొడుకునే కిడ్నాప్ చేసిన తండ్రి బాగోతం....

విడిపోయిన భార్యను ఇంటికి రప్పించేందుకు భర్త ఏం చేశాడంటే...

కుమారుడి కిడ్నాప్...తండ్రి నిర్వాకం

పూణే (మహారాష్ట్ర) : తన నుంచి విడిపోయి పుట్టింట్లో ఉంటున్న తన భార్యను తిరిగి ఇంటికి రప్పించేందుకు కన్న కొడుకునే కిడ్నాప్ చేసిన తండ్రి బాగోతం మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగుచూసింది. పూణే నగరంలోని పింప్రీ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి భార్య విడిపోయి తన పుట్టిల్లు అయిన షోలాపూర్ లో నివాసముంటోంది. భర్తను వదిలివేసిన భార్య తన మూడేళ్ల కుమారుడితో తల్లి ఇంట్లో ఉంటోంది. తన నుంచి విడిపోయిన భార్యను తిరిగి తన ఇంటికి రప్పించేందుకు తన మూడేళ్ల కుమారుడిని తండ్రి కిడ్నాప్ చేయించాడు. 


బాలుడి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా తన తండ్రే బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకుపోయాడని తేలింది. దీంతో పోలీసులు కిడ్నాప్ కేసులో తండ్రిని అరెస్టు చేసి, బాలుడిని తల్లికి అప్పగించారు.

Updated Date - 2020-10-08T16:14:54+05:30 IST