24 మంది ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న బస్సు.. సడన్‌గా డ్రైవర్‌కు ఫిట్స్.. ఆమె కనుక బస్సులో లేకపోయి ఉంటే..

ABN , First Publish Date - 2022-01-24T23:54:16+05:30 IST

24 మంది ప్రయాణికులతో బస్సు వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవర్‌‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో.. డ్రైవర్ సీట్ నుంచి అతడు కింద పడిపోయాడు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనలకు లోన

24 మంది ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న బస్సు.. సడన్‌గా డ్రైవర్‌కు ఫిట్స్.. ఆమె కనుక బస్సులో లేకపోయి ఉంటే..

ఇంటర్నెట్ డెస్క్: 24 మంది ప్రయాణికులతో బస్సు వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవర్‌‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో.. డ్రైవర్ సీట్ నుంచి అతడు కింద పడిపోయాడు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. సరిగ్గా అదే సమయానికి బస్సులో ఉన్న ఓ మహిళ ధైర్యసాహసాలను ప్రదర్శించింది. డ్రైవర్‌తోపాటు బస్సులో ఉన్న తోటి ప్రయాణికులను రక్షించింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


పూణేకు చెందిన యోగిత(42) దాదాపు 23 మంది ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణిస్తుండగా ఫిట్స్ కారణంగా డ్రైవర్ కుప్పకూలిపోయాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని.. దేవుణ్ని ప్రార్థించడం మొదలు పెట్టారు. సరిగ్గా అదే సమయానికి యోగిత తన దైర్యసాహసాలను ప్రదర్శించింది. స్టీరింగ్‌ను తన చేతుల్లోకి తీసుకుని బస్సు నడిపింది. తొలుత డ్రైవర్‌ను స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్చి.. తర్వాత ప్రయాణికులందరినీ తమ గమ్యస్థానాలకు చేర్చింది. 




యోగిత బస్సు నడుపుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. ఆమెపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా యోగితా మాట్లాడారు. కారు నడిపిన అనుభవంతో బస్సు నడిపినట్టు వివరించారు. తోటి ప్రయాణికులను రక్షించేందుకు బస్సు నడిపినట్టు వివరించారు. 


Updated Date - 2022-01-24T23:54:16+05:30 IST