2వేల మందికి భోజనం వడ్డించనున్న Puneeth Rajkumar కుటుంబం

Published: Sun, 07 Nov 2021 15:23:40 ISTfb-iconwhatsapp-icontwitter-icon
2వేల మందికి భోజనం వడ్డించనున్న Puneeth Rajkumar కుటుంబం

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో ఈ మధ్యనే మరణిచారు. ఆయన జిమ్ చేస్తుండగా హఠాత్తుగా కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని  వేరే దగ్గరికి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం విక్రమ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. 


పునీత్ రాజ్‌కుమార్ దశ దిన కర్మ కాండ(11వ రోజు ) నవంబర్ 8న జరగనుంది. దీని కోసం వారి కుటుంబ సభ్యులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు రెండు కార్యక్రమాలను చేయడానికి నిర్ణయించుకున్నారు. పునీత్ కుటుంబసభ్యులు వారి స్వ గృహంతో పాటు కంఠీరవ స్టేడియంలోను కార్యక్రమాలను చేయనున్నట్టు తెలుస్తోంది. ‘అప్పు’ దశ‌ దిన కర్మకాండ సందర్భంగా వారి కుటుంబం 2వేల మందికి  భోజనాన్ని వడ్డించనుంది.


పునీత్ రాజ్ కుమార్  సమాధి ఉన్న కంఠీరవ స్టేడియాన్ని అభిమానులు తరచుగా సందర్శిస్తూనే ఉన్నారు. బళ్లారికి చెందిన గురుప్రసాద్, గంగ ఆయనకు వీరాభిమానులు. ఇద్దరూ అప్పు సమాధి ఉన్న స్థలానికి చేరుకుని అక్కడే పెళ్లి చేసుకున్నారు. పునీత్ మరణంతో వీరు శోక సంద్రంలో మునిగిపోయారు. వివాహానికి ముందు వారి తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకోవడం విశేషం. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International