మిస్సెస్ ఆసియా యూఎస్‌ఏ రన్నరప్‌గా నిలిచిన భారతీయ మహిళ!

ABN , First Publish Date - 2021-12-06T00:02:56+05:30 IST

అమెరికాలోని లాస్ యాంజిలిస్ నగరంలో నిర్వహించిన మిస్సెస్ ఆసియా యూఎస్ఏ పోటీల్లో భారతీయ మహిళ రాధిక భోసలే రన్నరప్‌గా నిలిచారు.

మిస్సెస్ ఆసియా యూఎస్‌ఏ రన్నరప్‌గా నిలిచిన భారతీయ మహిళ!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరంలో నిర్వహించిన మిస్సెస్ ఆసియా యూఎస్ఏ పోటీల్లో భారతీయ మహిళ రాధిక భోసలే రన్నరప్‌గా నిలిచారు. వివాహిత మహిళల కోసం నిర్వహించే ఈ పోటీలో పూణేకు చెందిన ఆమె రన్నరప్‌గా ఎంపికయ్యారు. ఈ అందాల పోటీల్లో మొత్తం 48 ఆసియా దేశాలకు చెందిన వారు పాల్గొన్నారు. రాధిక భోసాలే ప్రస్తుతం అమెరికాలోని ఓ టెక్ స్టార్టప్‌ కంపెనీకి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ముంబైలో పుట్టిన పెరిగిన ఆమె.. ఇంజినీరింగ్‌ చేశారు. అంతేకాకుండా.. బిజిసెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఆమె మాస్టర్స్ చేశారు. అమెరికాలో రాధిక ఎన్నో సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. ఆమె భర్త ఫేస్‌బుక్‌లో సీనియర్ సెక్యూరిటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆ దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. కాగా.. వర్జీలియా ప్రొడక్షన్స్ సంస్థ అధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో కేవలం అందం, డ్రెస్సింగే కాకుండా.. పోటీదాలులు ఏమేరకు సమాజ సేవ చేశారనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. పోటీల అనంతరం మీడియాతో మాట్లాడిన రాధిక.. ప్రపంచవ్యాప్తంగా బాలికల అభ్యున్నతికి పాటుపడటమే తన లక్ష్యమని పేర్కొన్నారు.  

Updated Date - 2021-12-06T00:02:56+05:30 IST