పాఠ్యాంశంగా పునీత్‌ రాజ్‌కుమార్‌ జీవిత చరిత్ర

Published: Sat, 19 Mar 2022 12:29:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పాఠ్యాంశంగా పునీత్‌ రాజ్‌కుమార్‌ జీవిత చరిత్ర

బెంగళూరు: పవర్‌ స్టార్‌ డాక్టర్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ జీవిత చరిత్రను, ఆయన మానవీయ సేవలు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బెంగళూరు దక్షిణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌ఆర్‌ రమేష్‌ శుక్రవారం ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌కు ఒక లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని ఆయన మీడియాకు విడుదల చేశారు. ప్రచార ఆర్భాటాలకు తావులేని విధంగా పునీత్‌ వేలాది మంది నిరుపేద విద్యార్థులకు చదువు చెప్పించేవారని, వృద్ధులు, అనాథలకు కొండంత అండగా ఉండేవారని రమేష్‌ పేర్కొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.