చండీగఢ్: తమ డిమాండ్లపై CM చర్చలు జరపాలంటూ పంజాబ్ రైతుల బృందం డిమాండ్ చేస్తోంది. రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ రైతులు పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో చర్చలు జరుపుతామని పంజాబ్ రైతుల సంఘం నేతలు బుధవారం తెలిపారు. గోధుమలపై బోనస్, జూన్ 10 నుంచి వరి నాట్లు ప్రారంభించడం వంటి డిమాండ్లపై చర్చించాలని కోరారు. చండీగఢ్‌లో పంజాబ్ సీఎతో చర్చించేందుకు రైతు నాయకులను ఆహ్వానించినట్లు మొహాలీ డిప్యూటీ కమిషనర్, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.
ఇవి కూడా చదవండి