Punjab:నేను వీఐపీని కాదు, భద్రత తగ్గించండి..సీఎం పోలీసులకు ఆదేశం

Sep 24 2021 @ 07:46AM

చండీఘడ్ : పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ పోలీసులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు.తనకున్న పోలీసు భద్రతను తగ్గించమని సాక్షాత్తూ సీఎం చన్నీ పోలీసులను కోరారు. ముఖ్యమంత్రి అయ్యాక రక్షణగా 1000 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని తెలుసుకున్నపుడు తాను ఆశ్చర్యపోయానని సీఎం చన్నీ చెప్పారు. ‘‘నేను మీలో ఒకడిని, నా సొంత సోదరుల నుంచి కాపాడటానికి నాకు 1,000 మంది భద్రతా సిబ్బంది, సైన్యం అవసరం లేదు’’ అని సీఎం పేర్కొన్నారు.  కపూర్తలా ఐకే గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రభుత్వ వనరులను వృథా చేయరాదని, తాను సామాన్యుడినని, తన సొంత పంజాబీలు హాని చేస్తారని అనుకోవడం లేదని సీఎం చన్నీ వ్యాఖ్యానించారు. సీఎంగా తనకు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం పెద్ద కారు కొనేందుకు అర్హత  ఉందని తెలిసి ఆశ్చర్యపోయానని, దీనికి రూ.2కోట్లు వెచ్చించారని చన్నీ చెప్పారు.తాను సాధారణ జీవనం గడుపుతానని, వీఐపీ సంస్కృతి, విలాసాలు వద్దని, ఈ నిధులను ప్రజాసంక్షేమం, బలహీనవర్గాలు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి వినియోగించుకోవచ్చని సీఎం సూచించారు.

 తాను విలాసవంతమైన జీవనశైలిని ఇష్టపడనని, దీనికి బదులుగా పంజాబీలకు సేవ చేయడానికి ఉన్నానని చన్నీ చెప్పారు. తన అశ్విక దళానికి చెందిన వాహనాలను తగ్గించాలని సీఎం చన్నీ అధికారులను ఆదేశించారు.తాను వీఐపీ కాదని, సాధారణ పంజాబీనని, ఎవరైనా తనకు ఫోన్‌లో ఎప్పుడైనా ఫోన్ కాల్ చేయవచ్చని సీఎం చన్నీ చెప్పారు.


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.