రాజీనామా చేసేందుకు చండీఘడ్ వచ్చిన సీఎం చన్నీ

ABN , First Publish Date - 2022-03-10T16:33:20+05:30 IST

పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరో ఓటమి పాలవడంతో ఆ పార్టీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ తన పదవికి రాజీనామా చేయనున్నారు....

రాజీనామా చేసేందుకు చండీఘడ్ వచ్చిన సీఎం చన్నీ

చండీఘడ్ :పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరో ఓటమి పాలవడంతో ఆ పార్టీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ తన పదవికి రాజీనామా చేయనున్నారు. తాను పోటీ చేసిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఓటమి దిశగా పయనిస్తుండటంతో చన్నీ రాజీనామా చేసేందుకు గురువారం చండీఘడ్ నగరంలోని తన అధికార నివాసానికి వచ్చారు. చరణ్ జిత్ సింగ్ చన్నీ గురువారం మధ్యాహ్నం పంజాబ్ రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ను కలిసి తన రాజీనామాను సమర్పించే అవకాశముందని అధికారులు చెప్పారు. 


Updated Date - 2022-03-10T16:33:20+05:30 IST