prisoners are drug addicts: జైళ్లలో డ్రగ్ స్క్రీనింగ్ డ్రైవ్‌లో వెల్లడైన షాకింగ్ వాస్తవాలు‌

ABN , First Publish Date - 2022-07-26T14:05:27+05:30 IST

జైళ్లలో(jails) ఖైదీలకు(inmates) జరిపిన డ్రగ్ స్క్రీనింగ్ డ్రైవ్‌లో(drug screening drive) షాకింగ్(shocking)...

prisoners are drug addicts: జైళ్లలో డ్రగ్ స్క్రీనింగ్ డ్రైవ్‌లో వెల్లడైన షాకింగ్ వాస్తవాలు‌

42 శాతం ఖైదీలు డ్రగ్స్‌కు బానిసలు

చండీఘడ్ (పంజాబ్): జైళ్లలో(jails) ఖైదీలకు(inmates) జరిపిన డ్రగ్ స్క్రీనింగ్ డ్రైవ్‌లో(drug screening drive) షాకింగ్(shocking) వాస్తవాలు వెలుగుచూశాయి.జైళ్లలో‌ డ్రగ్స్ వినియోగాన్ని గుర్తించేందుకు పంజాబ్ ప్రభుత్వం జైళ్లలోని ఖైదీలకు డ్రగ్ స్క్రీనింగ్ డ్రైవ్‌ చేపట్టింది.జైళ్లలోని 42 శాతం మంది ఖైదీలకు జరిపిన పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్‌గా(prisoners are drug addicts) తేలింది. ఈ పరీక్షల రిపోర్టుతో జైలు అధికారులు షాక్‌కు గురయ్యారు.పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని 14 జైళ్లు,సబ్ జైళ్లలో 8,000 మందికి పైగా ఖైదీలను డ్రగ్ స్క్రీనింగ్ చేయగా, వారిలో 42 శాతం మంది ఖైదీలు మాదకద్రవ్యాలకు బానిసలు అని తేలింది.పంజాబ్ రాష్ట్రంలోని వివిధ జైళ్లలో నిర్వహించిన డోప్ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉన్నాయి.


డ్రగ్ టెస్టులో వెలుగుచూసిన షాకింగ్ నిజాలు

జైళ్లలోని 42 శాతం మంది ఖైదీలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారని, మార్ఫిన్, ట్రామడాల్, బుప్రెనార్ఫిన్ వంటి డ్రగ్స్ వాడుతున్నట్లు ప్రాథమిక నమూనాలో తేలింది.డ్రగ్స్ చరిత్ర లేని ఖైదీలకు కూడా జరిపిన పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది.గురుదాస్‌పూర్, అమృత్‌సర్, భటిండాతో పాటు, నభా ఓపెన్ జైలు, పట్టి, ఫజిల్కా, మోగా, మలేర్‌కోట్ల సబ్ జైళ్లతో పాటు ముక్త్‌సర్, బర్నాలా మాన్సా, నభా, రూప్‌నగర్ జైళ్లలో కూడా ఖైదీలకు డ్రగ్స్ స్క్రీనింగ్ జరిగింది.జైళ్లలో డ్రగ్స్‌ను జైలు అధికారులు స్వాధీనం చేసుకోకపోవడం ఆశ్చర్యకరం.అమృత్‌సర్‌లో 1900ఖైదీల్లో 900 మంది (47 శాతం), భటిండా జైలులో 1673 మందిలో 647 మంది (38 శాతం), గురుదాస్‌పూర్‌లో 997 మంది ఖైదీల్లో 425 మంది (42 శాతం) డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది.


సగం మంది ఖైదీలకు డ్రగ్స్ పాజిటివ్‌

బర్నాలా జైలులోని దాదాపు సగం మంది ఖైదీలకు డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. ఈ జైలులో మొత్తం 566 మంది ఖైదీలు ఉండగా, వారిలో 252 మంది డ్రగ్స్‌కు బానిసలుగా ఉన్నట్లు వెల్లడైంది.డ్రగ్స్ బానిస ఖైదీలను కనుగొని, వారికి చికిత్స చేయడానికి, జైళ్లలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరించే జైలు అధికారులను గుర్తించడానికి రెండు వైపులా డ్రైవ్ ప్రారంభించామని పంజాబ్ జైలు మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ చెప్పారు.“ఖైదీలందరికీ డ్రగ్స్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు, వారిలో ఎంతమంది డ్రగ్స్ బానిసలు ఉన్నారు? వారు ఎలాంటి డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు.డ్రగ్స్ జైళ్లకు ఎలా చేరాయి అనే దానిపై కూడా విచారణ జరుపుతున్నారు. ఎవరు దోషులుగా తేలినా వారిని శిక్షిస్తామని జైళ్ల శాఖమంత్రి చెప్పారు. 


డ్రగ్ అడిక్ట్ ఖైదీలకు చికిత్స, కౌన్సెలింగ్

డ్రగ్స్ పాజిటివ్‌గా తేలిన ఖైదీలకు చికిత్స అందించి, కౌన్సెలింగ్ చేస్తామని హర్జోత్ సింగ్ బైన్స్ చెప్పారు.పంజాబ్ ఖైదీల్లో డ్రగ్స్ అడిక్షన్ రేటు ఎక్కువగా ఉండటంతో జైలు అధికారుల లీలలు వెలుగుచూశాయి.కేవలం 10 శాతం మంది ఖైదీలు మాత్రమే డ్రగ్స్‌కు బానిసలుగా ఉన్నారని గతంలో అంచనా వేసిన జైలు అధికారులు ఇప్పుడు తాజా డోప్ టెస్ట్ ఫలితాలు అంచనా కంటే నాలుగురెట్లకు పైగా ఉండటంతో ఆశ్చర్యపరిచాయి.డ్రగ్స్‌కు బానిసలైన ఖైదీల సంఖ్య పెరుగుతుండడం వల్ల వారు సులభంగా డ్రగ్స్‌ను పొందుతున్నారని స్పష్టంగా చెబుతున్నారు.అయితే అధికారులు మాత్రం డ్రగ్స్‌ డీ అడిక్షన్‌ డ్రైవ్‌ చేపడతామంటున్నారు.డ్రగ్స్‌కు బానిసలైన ఖైదీలను డ్రగ్స్ ఎక్కడివి అని మాజీ డీజీ ప్రశ్నించారు.పంజాబ్ జైలు అధికారులు గతంలోనూ ఖైదీలకు డ్రగ్స్ సరఫరా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని డీజీ ఆరోపించారు.


జైలు అధికారులపై డ్రగ్స్ సరఫరా కేసు

ముక్త్‌సర్‌ జైలు వార్డెన్‌ కుల్వీందర్‌ సింగ్‌తో పాటు మరో ఐదుగురిపై కూడా ఇటీవల జైలులో డ్రగ్స్‌ సరఫరా చేసినందుకు కేసు నమోదైంది. 70 చరస్ మాత్రలు అందించినందుకు వార్డెన్ కు రూ.3వేలు చెల్లించినట్లు సమాచారం.అమృత్‌సర్‌లోని ఫతేపూర్ జైలులో అధికారులు ఇద్దరు ఖైదీల వద్ద నుంచి మొబైల్ ఫోన్‌తో పాటు రెండు గ్రాముల హెరాయిన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పలువురు జైలు అధికారులు అరెస్టయ్యారు.పంజాబ్ జైళ్లలో మాదకద్రవ్య వ్యసనం వ్యాప్తి చెందడానికి జైలు వాతావరణం కారణమని జైళ్ల మాజీ డీజీ శశికాంత్ చెప్పారు.


Updated Date - 2022-07-26T14:05:27+05:30 IST