Private Schoolsలో ఫీజుల పెంపుపై దర్యాప్తునకు సీఎం ఆదేశం

ABN , First Publish Date - 2022-04-25T13:36:48+05:30 IST

ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఫీజులు పెంచినందుకు 720 ప్రైవేట్ పాఠశాలలపై పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది...

Private Schoolsలో ఫీజుల పెంపుపై దర్యాప్తునకు సీఎం ఆదేశం

చండీగఢ్: ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఫీజులు పెంచినందుకు 720 ప్రైవేట్ పాఠశాలలపై పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.పలు ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను విస్మరిస్తున్నాయని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత స్పందించిన సర్కారు విచారణ జరపాలని నిర్ణయించింది.పాఠశాలలపై విచారణకు సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు.‘‘తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన 720 ప్రైవేట్ పాఠశాలలపై విచారణకు ఆదేశించాం. దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి తన ట్వీట్‌లో తెలిపారు.


అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు పెంచడం లేదా పుస్తకాలు, యూనిఫాంలు లేదా స్టేషనరీ వస్తువులను ఎంపిక చేసిన దుకాణాల నుంచి కొనుగోలు చేయమని పిల్లలను బలవంతం చేయవద్దని గత నెలలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశించారు.ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల కొనుగోలు విషయంలో ప్రభుత్వ ఆదేశాలను ఈ ప్రైవేట్ పాఠశాలలు పాటించడం లేదని తల్లిదండ్రులు పేర్కొనడంతో విద్యాశాఖ మంత్రి విచారణకు ఆదేశించారు.విచారణలో ఏదైనా పాఠశాల దోషిగా తేలితే, దానిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

Updated Date - 2022-04-25T13:36:48+05:30 IST