Carona మృతులకు పంజాబ్ రూ.50వేల పరిహారం

ABN , First Publish Date - 2021-10-13T14:06:45+05:30 IST

పంజాబ్ ప్రభుత్వం కొవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని ప్రకటించింది...

Carona మృతులకు పంజాబ్ రూ.50వేల పరిహారం

చండీఘడ్: పంజాబ్ ప్రభుత్వం కొవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని ప్రకటించింది.పంజాబ్ రాష్ట్రంలో కరోనాతో 16,531 మంది మరణించారు.కరోనా కారణంగా మరణించిన వారందరి కుటుంబాలకు రూ.50వేల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.సుప్రీంకోర్టు ఆదేశానుసారం కరోనా మృతుల కుటుంబాలకు కేంద్రప్రభుత్వం రూ.50వేలు చెల్లించనుంది. పంజాబ్ రాష్ట్రప్రభుత్వం కేంద్రం ఇచ్చే పరిహారానికి అదనంగా రాష్ట్ర బడ్జెట్ నుంచి మరో 50వేలరూపాయలు అందించాలని నిర్ణయించింది. కొవిడ్ కారణంగా మరణించారనే ధ్రువీకరణ పత్రం లేదనే కారణంగా పరిహారాన్ని ఏ రాష్ట్రం తిరస్కరించకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్ర విపత్తు సహాయ నిధుల నుంచి ఈ పరిహారాన్ని కరోనా మృతుల కుటుంబాలకు అందించాలని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

Updated Date - 2021-10-13T14:06:45+05:30 IST