
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ నేతల భద్రతను భగవంత్ మాన్ ప్రభుత్వం తగ్గించింది. ఎనిమిది మంది కాంగ్రెస్ నేతలకు ఇప్పటి వరకు ఉన్న భద్రతను కుదించింది. అందులో మాజీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, పార్టీ అధినేతలు ఉన్నారు. పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధినేత Sunil Jakhar కు ఇప్పటి వరకు ఉన్న Z కేటగిరీ భద్రతను తగ్గించారు. ఇంతకు ముందు మూడు భద్రతా వాహనాలు, 14 మంది భద్రతా సిబ్బంది ఉండగా.. ప్రస్తుతం ఒకే వాహనం, ఇద్దరు భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి Harsimrat Kaur భద్రతను Y కేటగిరీకి తగ్గించారు. మొత్తంగా తాజా కుదింపులో 127 మంది భద్రతా సిబ్బందిని తొమ్మిది వాహనాలను తగ్గించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. భద్రతా సిబ్బందిని తగ్గిస్తామని ప్రకటించారు. ఆరోజు ఆయనకు భద్రతగా వచ్చిన వారిని చాలా వరకు తగ్గించారు.
ఇవి కూడా చదవండి