చండీఘడ్ కోసం పంజాబ్, హరియాణా పోరు

ABN , First Publish Date - 2022-04-03T22:39:02+05:30 IST

చండీఘడ్ ఉద్యోగులకు సంబంధించి ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజకీయ రంగు పులుముకుంటోంది. చండీఘడ్.. అటు పంజాబ్-హరియాణాలకు ఉమ్మడి రాజధానిగా, ఇటు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న సంగతి తెలిసిందే.

చండీఘడ్ కోసం పంజాబ్, హరియాణా పోరు

చండీఘడ్ ఉద్యోగులకు సంబంధించి ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజకీయ రంగు పులుముకుంటోంది. చండీఘడ్.. అటు పంజాబ్-హరియాణాలకు ఉమ్మడి రాజధానిగా, ఇటు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న సంగతి తెలిసిందే. చండీఘడ్‌లోని ఉద్యోగులకు కేంద్ర సివిల్ సర్వీసెస్ నిబంధనలు వర్తిస్తాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. దీంతో చండీఘడ్ విషయంలో కేంద్ర పెత్తనాన్ని అడ్డుకోవాలంటే, ఈ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని పంజాబ్ నిర్ణయించింది. చండీఘడ్‌ను తమకు పూర్తిగా స్వాధీనం చేయాలని కోరుతూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో ఇప్పుడు హరియాణా కూడా ఈ అంశంపై స్పందించింది. చండీఘడ్‌ను పూర్తిగా తమకే అప్పగించాలని కోరుతూ హరియాణా క్యాబినేట్ తీర్మానం చేసింది. దీనికోసం ఈ నెల 5న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. హరియాణాలో బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారంలో ఉంటే, పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రస్తుతం చండీఘడ్ విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు ఇది రెండు రాష్ట్రాల సమస్యగా మారింది.

Updated Date - 2022-04-03T22:39:02+05:30 IST