టాస్ గెలిచిన పంజాబ్.. లక్నోను నిలువరిస్తుందా?

Published: Fri, 29 Apr 2022 19:27:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
టాస్ గెలిచిన పంజాబ్.. లక్నోను నిలువరిస్తుందా?

పూణె: పంజాబ్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మరికాసేపట్లో ఐపీఎల్‌లో 42వ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టాస్ గెలిచిన పంజాబ్ ప్రత్యర్థి లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 8 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలు సాధించిన సూపర్ జెయింట్స్ 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 8 మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో గెలిచిన పంజాబ్ 8 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.


ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం పంజాబ్‌కు అత్యంత కీలకం. అలాగే, ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే లక్నో మూడో స్థానానికి చేరుకుంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే, వరుస విజయాలతో ఊపుమీదున్న లక్నోను పంజాబ్ ఏమాత్రం అడ్డుకోగలదన్న ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, లక్నోలో ఒక్క మార్పు జరిగింది. మనీష్ స్థానంలో అవేశ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.