వద్దే వద్దన్న భార్య.. ఆమె మాటలు అస్సలు పట్టించుకోని భర్త.. కానీ 34ఏళ్ల తర్వాత అదృష్టం వరించడంతో..

ABN , First Publish Date - 2022-04-23T21:25:42+05:30 IST

మారుమూల గ్రామానికి చెందిన అతడికి బట్టలకొట్టే జీవనధారం. దుస్తులు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించాలి. వ్యాపారం అంతంత మాత్రమే ఉండటంతో అతడిని ఆర్థిక ఇబ్బందులు చు

వద్దే వద్దన్న భార్య.. ఆమె మాటలు అస్సలు పట్టించుకోని భర్త.. కానీ 34ఏళ్ల తర్వాత అదృష్టం వరించడంతో..

ఇంటర్నెట్ డెస్క్: మారుమూల గ్రామానికి చెందిన అతడికి బట్టలకొట్టే జీవనధారం. దుస్తులు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించాలి. వ్యాపారం అంతంత మాత్రమే ఉండటంతో అతడిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఆర్థిక కష్టాలు వెంటాడుతన్న నేపథ్యంలోనే అతడికి ఓ ఆలోచన వచ్చింది. లాటరీ టికెట్ ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. విషయాన్ని భార్యకు చెప్పాడు. అయితే ఆమె మాత్రం అందుకు ఒప్పుకోలేదు. చివరికి అతడిని అదృష్టం వరించింది. లాటరీలో రూ.2.5కోట్లు గెలుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


పంజాబ్‌లోని మెహ్రాజ్ గ్రామానికి చెందిన రోషన్ సింగ్‌కు.. కొన్నేళ్ల క్రితమే ఓ మహిళతో వివాహం జరిగింది. మొదట్లో కుటుంబాన్ని పోషించేందుకు బట్టల దుకాణంలో పని చేసిన రోషన్ సింగ్.. 1987లో సొంతంగా దుస్తుల దుకాణాన్ని ప్రారంభించాడు. అదే సమయంలో తన భార్య వొద్దని ఎంత చెప్పినా వినకుండా లాటరీ టికెట్లను కొనుగోలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సుమారు 34ఏళ్ల తర్వాత అతడిని అదృష్టం వరించింది. పంజాబ్ స్టేట్ బంపర్ లాటరీలో ఏకంగా రూ.2.5కోట్లు గెలుపొందాడు. ఈ విషయం తెలిసి ఎగిరి గంతేశాడు. 



లాటరీ టికెట్ డీలర్ నుంచి తొలుత ఫోన్ వొచ్చినపుడు నమ్మలేకపోయానని చెప్పాడు. తన ఫ్రెండ్స్‌ కూడా దాన్ని ప్రాంక్ కాల్‌గా భావించారని తెలిపాడు. అయితే తాను నిజంగానే బంపర్ ఫ్రైజ్‌ను గెలిచినట్లు తెలిసి.. కుటుంబ సభ్యులు సహా స్నేహితులు సంతోషం వ్యక్తం చేసినట్టు పేర్కొన్నాడు. ట్యాక్స్‌లు అన్నీపోనూ తన చేతికి రూ.1.75కోట్లు వస్తుందని వివరించాడు. ఈ డబ్బును తన ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం అలాగే కొత్త బిజినెస్ ప్రారంభించడానికి ఉపయోగిస్తానని వెల్లడించాడు. 



Updated Date - 2022-04-23T21:25:42+05:30 IST