Viral Video: ఒక ప్రొఫెసర్ చేయాల్సిన పనేనా ఇది.. పూటుగా మందు తాగి.. క్లాస్ రూమ్‌లో..

ABN , First Publish Date - 2022-09-24T20:08:34+05:30 IST

అతడి వయసు సుమారు 50ఏళ్ల వరకు ఉంటుంది. ఓ కళాశాలలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా(Professor) పని చేస్తున్నాడు. విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన అతడు.. మరొకరితో చెప్పించుకునే స్థాయికి దిగజారాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో

Viral Video: ఒక ప్రొఫెసర్ చేయాల్సిన పనేనా ఇది.. పూటుగా మందు తాగి.. క్లాస్ రూమ్‌లో..

ఇంటర్నెట్ డెస్క్: అతడి వయసు సుమారు 50ఏళ్ల వరకు ఉంటుంది. ఓ కళాశాలలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా(Professor) పని చేస్తున్నాడు. విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన అతడు.. మరొకరితో చెప్పించుకునే స్థాయికి దిగజారాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


పంజాబ్‌కు చెందిన రవీందర్ కుమార్.. గురు నానాక్ దేవ్ యూనివర్సిటీకి చెందిన కాలేజీలో మాథ్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా ఇతడు పూటుగా మద్యం సేవించి.. క్లాస్ రూమ్‌కు వచ్చాడు. అంతటితో ఆగకుండా.. పాటలు పాడుతూ.. వాటికి చిందేశాడు(Dances In Classroom). ఈ క్రమంలో అక్కడున్న కొందరు విద్యార్థులు అతడ్ని మరింత ప్రోత్సహించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌(Viral)గా మారింది. వీడియో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో కళాశాల ప్రిన్సిపల్ స్పందించారు. కాలేజీలో రవీందర్ కుమార్.. పార్ట్‌ టైం ప్రొఫెసర్‌గా పని చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా అతడిపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. రవీందర్ కుమార్‌ను విధుల నుంచి తొలగించినట్టు తెలిపారు. అయితే ఈ మొత్తం ఘటనపై స్పందించిన రవీందర్ కుమార్.. తాను చేసిన పనిని సమర్థించుకున్నాడు. 




Updated Date - 2022-09-24T20:08:34+05:30 IST