రాష్ట్రాన్ని మరో పంజాబ్‌గా మార్చకండి: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-03-11T21:04:52+05:30 IST

‘‘తెలంగాణ రాష్ట్రాన్ని మరో పంజాబ్‌గా మార్చకండి’’ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంజాబ్‌లో డ్రగ్స్‌కు బానీసలై రాష్ట్రం నిర్వీర్యమయ్యిందన్నారు

రాష్ట్రాన్ని మరో పంజాబ్‌గా మార్చకండి: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రాన్ని మరో పంజాబ్‌గా మార్చకండి’’ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంజాబ్‌లో డ్రగ్స్‌కు బానీసలై రాష్ట్రం నిర్వీర్యమయ్యిందన్నారు. తెలంగాణలో గుట్కా లేదు, మట్కా లేదు అని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. గల్లీగల్లీలో గంజాయి గుప్పుమంటోందని, తాను అప్రమత్తం చేశానని చెప్పారు. ఈ గుట్కా, మట్కా, డ్రగ్స్‌పై నిఘా లేక పోతే.. మరో పంజాబ్ అవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చిరించానని గుర్తుచేశారు. 2017లో డ్రగ్స్ కేసులో 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి హడావుడి చేశారని, ఆ కేసును రాష్ట్ర ప్రభుత్వం తొక్కి పెట్టిందని రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు.

Updated Date - 2022-03-11T21:04:52+05:30 IST