
న్యూఢిల్లీ: ఈ యేడాది నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పంజాబ్‌కు చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఈ శకటాన్ని రూపొందించారు. స్వాతంత్ర్యయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ప్రధానంగా పేర్కొంటూ పంజాబ్‌లో స్వాతంత్ర్య పోరాట కాలం నాటి సందర్భాలను వివరించే విధంగా ఈ శకటాన్ని రూపొందించారు. ఇక జలియన్‌వాలా బాఘ్ నిందితుడు జనరల్ డయ్యర్‌ను సద్ధామ్ ఉద్దమ్ సింగ్ లండన్ వెళ్లి కాల్చి చంపిన ఘటనను కూడా ప్రస్తావించారు. త్రివిధ దళాలతో పాటు వివిధర రాష్ట్రాలు, వివిధ మంత్రిత్వ శాఖల శకటాల్లో స్వాతంత్ర్య పోరాటం నాటి ఆనవాళ్లు కనిపించినప్పటికీ పంజాబ్ శకటమే అమితంగా ఆకర్షించిందని నెటిజెన్లు అంటున్నారు.
ఇవి కూడా చదవండి