త్వరలో 5 ఎన్నారై కోర్టుల ఏర్పాటు.. పంజాబ్ ప్రభుత్వ నిర్ణయం

ABN , First Publish Date - 2022-05-25T03:19:40+05:30 IST

పంజాబ్‌లో ఎన్నారై కోర్టుల సంఖ్య పెంచేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఐదు కొత్త ఎన్నారై న్యాయస్థానాలను ఏర్పాటు చేయబోతోంది.

త్వరలో 5 ఎన్నారై కోర్టుల ఏర్పాటు.. పంజాబ్ ప్రభుత్వ నిర్ణయం

ఎన్నారై డెస్క్: పంజాబ్‌లో ఎన్నారై కోర్టుల సంఖ్య పెంచేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఐదు కొత్త ఎన్నారై న్యాయస్థానాలను ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉన్న ఒకే ఒక ఎన్నారై కోర్టు జలంధర్‌లో ఉంది. ఈ నేపథ్యంలో.. బఠిండా, నవాన్‌షహర్, పాటియాలా, హోషియార్‌పూర్‌, మోగాలో ఈ కొత్త కోర్టులు కొలువుదీరనున్నాయి. కాగా.. రాష్ట్రంలో మొత్తం 2500 ఎన్నారై కేసులు పెండింగ్‌లో ఉన్న ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ ధలీవాల్ పేర్కొన్నారు. ‘‘కొత్త ఎన్నారై పాలసీలో భాగంగా ప్రవాసీయులకు అన్ని రకాల సహాయాలు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎన్నారై కమిషన్ ద్వారా తక్కువ సమయంలో ఎన్నారైల సమస్యల పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ’’ అని ఆయన తెలిపారు. ఎన్నారైల సమస్యలకు పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో ఓ నోడల్ అధికారిని నియమించనున్నట్టు  ఆయన తెలిపారు.



Updated Date - 2022-05-25T03:19:40+05:30 IST