వైభవంగా పున్నమి గరుడోత్సవం

ABN , First Publish Date - 2020-07-06T11:07:31+05:30 IST

కాణిపాకంలో పున్నమి గరుడోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. వరసిద్ధుడి ..

వైభవంగా పున్నమి గరుడోత్సవం

ఐరాల(కాణిపాకం), జూలై 5: కాణిపాకంలో పున్నమి గరుడోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. వరసిద్ధుడి ఆలయానికి అనుబంధ ఆలయమైన వరదరాజ స్వామి ఆలయంలో ఉదయం మూల విరాట్‌కు ఘనంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాగణంలో దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వరదరాజ స్వామి ఉత్సవర్లతో  ప్రాకారోత్సవం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేశు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-06T11:07:31+05:30 IST