పునుగులు

ABN , First Publish Date - 2022-02-05T19:34:32+05:30 IST

అన్నం - రెండు కప్పులు, పచ్చిమిర్చి - రెండు, శనగపిండి - ఒకకప్పు, క్యారెట్‌ తురుము - ఒకకప్పు, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర

పునుగులు

కావలసినవి: అన్నం - రెండు కప్పులు, పచ్చిమిర్చి - రెండు, శనగపిండి - ఒకకప్పు, క్యారెట్‌ తురుము - ఒకకప్పు, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - రెండు స్పూన్లు, అల్లంపేస్టు - ఒక స్పూను, జీలకర్ర - ఒక స్పూను, కారం - ఒక స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం: ముందుగా మిక్సీలో అన్నం వేసి మెత్తగా పట్టుకోవాలి. తరువాత శనగపిండి, పచ్చిమిర్చి, క్యారెట్‌ తురుము, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి మరో సారి పట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా చూసుకోవాలి.ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని పునుగులు వేసుకుని వేయించాలి.వేడి వేడి పునుగులను టొమాటో చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2022-02-05T19:34:32+05:30 IST