రూ.3వేల కోట్ల నష్టమొచ్చినా ధాన్యం కొనుగోలు

ABN , First Publish Date - 2022-05-16T05:27:12+05:30 IST

తులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోవడంతో రూ.3వేల కోట్ల నష్టమొచ్చినప్పటికీ భరించి సీఎం కేసీఆర్‌ ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు

రూ.3వేల కోట్ల నష్టమొచ్చినా ధాన్యం కొనుగోలు
మనోహరాబాద్‌లో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్‌లో రూ.40 కోట్లతో మరో 100 పడకల ఆస్పత్రి

త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు

తూప్రాన్‌, మనోహరాబాద్‌లో సమీకృత కార్యాలయాల

భవనాలకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన


తూప్రాన్‌, మే 15: రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోవడంతో రూ.3వేల కోట్ల నష్టమొచ్చినప్పటికీ భరించి సీఎం కేసీఆర్‌ ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.   ఆదివారం మనోహరాబాద్‌లో రూ.5కోట్లు, తూప్రాన్‌లో రూ. 8 కోట్లతో నిర్మించనున్న సమీకృత కార్యాలయాల భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని కార్యాలయాలు ఒకే చోటా ఉంటాయని,  ప్రజలకు సేవ చేయాలని నిర్మిస్తున్నట్లు చెప్పారు. మనోహరాబాద్‌ కోసం మరో రూ. 5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు. పోలీసుస్టేషన్‌ భవనానికి స్థలం ఉందని చెప్పారని, ఎకరం స్థలమిస్తే భవనం కట్టుకుందామన్నారు. స్థలం ఉంటే ఒక్కొక్కరికి రూ. 3లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామన్నారు. కొత్త పింఛన్లు త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పారు. గజ్వేల్‌లో మరో వంద పడకల ఆస్పత్రిని రూ.40 కోట్లతో పక్కనే నిర్మించబోతున్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నుంచి పిలుపు రావడంతో తూప్రాన్‌లో ప్రారంభించి, ప్రసంగించకుండానే వెళ్లిపోగా ప్రజలనుద్ధేశించి ఎంపీ, ఇతర నాయకులు మాట్లాడారు. మనోహరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోలును పరిశీలించారు.  కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్‌ ర్యాకలహేమలతాశేఖర్‌గౌడ్‌, కొత్తప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, తెలంగాణ ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, మనోహరాబాద్‌ ఎంపీపీ పురం నవనీతారవి, తూప్రాన్‌ ఎంపీపీ గడ్డి స్వప్నవెంకటేశ్‌యాదవ్‌, జడ్పీటీసీ రాణిసత్యనారాయణగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, సర్పంచు మహిపాల్‌రెడ్డి, ఫాక్స్‌ చైర్మన్‌ మెట్టు బాలకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బొల్లంపల్లి బాబుల్‌రెడ్డి, పురం మహేశ్‌, వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పేయింటర్‌ శ్రీనివాస్‌, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. 


ద్విభాషలో పుస్తకాల ముద్రణ

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లభోధన చేయబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఒకటేసారి ఇంగ్లీష్‌ మీడియంలో బోధన కష్టమవుతుందని పాఠ్యపుస్తకాలు ఇంగ్లీష్‌, తెలుగులో ముద్రిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం తూప్రాన్‌ హైస్కూళ్లో మన ఊరు మన  బడి కార్యక్రమానికి మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. పాఠ్యపుస్తకాలలో పైన తెలుగు కింద ప్యారగ్రాఫ్‌ ఇంగ్లి్‌షలో ఉం టుందన్నారు. అన్ని వసతులు ఉండాలని ఇంగ్లీష్‌ బోధన ఉండాలని ఎక్కువ మంది పిల్లలు చదివే పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. పూర్వవిద్యార్థులు, ఎన్‌ఆర్‌ఐలు పాఠశాలకు సహకరించాలన్నారు. 


టీఆర్‌ఎస్‌ వల్లే తూప్రాన్‌ అభివృద్ధి : ఎంపీ

తూప్రాన్‌రూరల్‌, మే15: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే తూప్రాన్‌ మండలం అభివృద్ధిని సాధిస్తుందని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో గ్రామాల్లో ప్రజలు తాగు, సాగుకు తిప్పలు పడేవారని, ఇప్పుడు ఆ ఇబ్బందులు తప్పాయని ఆయన చెప్పారు. రూ.8 కోట్లతో నిర్మించనున్న తూప్రాన్‌ మండల కార్యాలయాల సమీకృత భవనాల పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. మంత్రి వేదికపైకి రాకుండానే వెళ్లిపోవడంతో ఎంపీ సమావేశాన్ని కొనసాగించారు. పచ్చనిచెట్లు, పరిశుభ్రత ఇంటింటికీ తాగునీళ్లతో గ్రామాలను సమస్యలు లేకుండా సస్యశ్యామలంగా మార్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని దివించాలని, కేసీఆర్‌ను మూడోసారి సీఎంగా చేయాలని ఆయన కోరారు. అనంతరం జడ్పీటీసీ రాణి సత్యనారాయణగౌడ్‌ మాట్లాడారు. పర్యటనలు పట్టణానికే పరిమితం కాకుండా గ్రామాల్లోనూ చేపట్టాలని కోరారు. మంత్రి వేదిక దాకా వచ్చి వెనుతిరిగి వెళ్లిపోవడంతో ప్రజలు నిరాశకుగురయ్యారు. కార్యక్రమంలో జడ్పీ జడ్పీచైర్‌పర్సన్‌ హేమలతాగౌడ్‌, ఎంపీపీ స్వప్న, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, ఫుడ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షణ్‌రెడ్డి, మండల ప్యాక్స్‌ చైర్మన్‌ బాలక్రిష్ణారెడ్డి, రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహిపాల్‌రెడ్డి, మండల ఫోరం అద్యక్షుడు భగవాన్‌రెడ్డి,టీఆర్‌ఎ్‌స మండలాద్యక్షుడు బాబుల్‌రెడ్డి, పాల్గొన్నారు.


గౌడ కులస్థుల సమస్యను సీరియ్‌సగా తీసుకోండి

తూప్రాన్‌ గౌడకులస్థులకు చెందిన విలువైన భూమిని కొందరు దొంగ సొసైటీని సృష్టించుకుని అమ్ముకున్న విషయాన్ని గౌడ కులస్తులు మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకువచ్చారు.  స్పందించిన మం త్రి హరీశ్‌రావు అక్కడున్న అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ను పిలిచి గౌడ కులస్తుల సమస్యను సీరియ్‌సగా తీసుకుని తగిన న్యాయం చేయాలని, చీటింగ్‌కు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - 2022-05-16T05:27:12+05:30 IST