కొనుగోళ్లు ఇంకెప్పుడు?

ABN , First Publish Date - 2020-10-23T11:34:46+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో వరి పం టను సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇన్నాళ్లు కాలం దోబూచులాటతో ఇబ్బందులు పడ్డ రైతులు..

కొనుగోళ్లు ఇంకెప్పుడు?

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులకు ఇక్కట్లు

రోడ్లపైనే దర్శనమిస్తున్న ధాన్యం రాశులు


బోధన్‌, అక్టోబరు 22: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో వరి పం టను సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇన్నాళ్లు కాలం దోబూచులాటతో ఇబ్బందులు పడ్డ రైతులు.. ప్రస్తుతం ధాన్యం కొ నుగోళ్లు లేక అవస్థలు పడుతున్నారు. ఉభయ జిల్లాల్లో వరికోతలు ము మ్మరంగా సాగుతుండడంతో ఎటుచూసిన ధాన్యం రాశులే దర్శనమిస్తు న్నాయి. మరోవైపు ఈ ఏడాది వర్షకాలంలో ప్రభుత్వం సన్నరకం ధాన్యం సాగుచేయాలని ఆంక్షలు విధించడంతో అధికశాతం రైతులు సన్నరకం ధాన్యాన్ని సాగుచేశారు. ప్రతియేటా దొడ్డురకం, సన్నరకం కలిపి సాగు చే సి దొడ్డు ధాన్యం ముందుగా కోతలు సాగడం.. ఆ తరువాత 15 రోజులు కు సన్నరకం ధాన్యం కోతకు వచ్చేది. కానీ ఈ ఏడాది వింత పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు అంతా సన్నరకం ధాన్యమే సాగులో ఉండడంతో కో తలన్నీ ఒకేసారి మొదలుకావడంతో రైతులను ఆందోళనకు గురి చేస్తోం ది. ధాన్యాన్ని కొనేవారు లేకపోవడం మరోవైపు కొనుగోలు కేంద్రాల జా ప్యం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కోతలను ముగించిన రైతులు ధాన్యాన్ని ఆరబోసి విక్రయాలకు సిద్ధం చేశారు.


మరికొంత మంది రైతులు కల్లాలోనే పచ్చి ధాన్యాన్ని విక్రయించుకుంటున్నారు. కొనుగో లు కేంద్రాలలో ధాన్యం విక్రయించుకొని ఎంతోకొంత లాభపడదామని ఆ శిస్తున్న రైతులకు భంగపాటు తప్పడం లేదు. జిల్లాలో ఇప్పటికే కొనుగో లు కేంద్రాలు ప్రారంభం కావాల్సి ఉండగా వివిధ కారణాల చేత ప్రారం భం కావడం లేదు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశామని ప్రకటనలు చేస్తూ, కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న అధికారులు, ప్రజాప్రతిని ధులు హడావిడి చేస్తున్నా సదరు కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు ప్రా రంభం కావడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కొనుగోళ్లు మొదలవ్వలేదు. రైస్‌మిల్‌లకు అలాట్‌మెం ట్‌ కాపీలు కేటాయించకపోవడం, గన్నీ బస్తాలు ఇంక క్షేత్రస్థాయిలో రా కపోవడం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్ల ప్రక్రియకు అడ్డంకులుగా మారాయి.


మరోవైపు పచ్చిధాన్యం విక్రయాలలో దళారులు, వ్యాపారులు రై తులను నిండాదోపిడీ చేస్తున్నారు. పచ్చిధాన్యాన్ని క్వింటాలుకు రూ.1,400 లోపే కొనుగోలు చేయడం తరుగు, ఇతర కారణాల చేత కోతలు విధించ డం రైతులకు తలపోటుగా మారింది. పచ్చిధాన్యాన్ని గత్యంతరం లేక వి క్రయిస్తున్న రైతులు పెద్ద ఎత్తున నష్టం చవిచూస్తున్నారు. ఇప్పటికే కాల ంతో కొట్లాడి అలసిపోయిన రైతులు.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంపై ఆగ్రహంతో ఉన్నారు. కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయా లని వేడుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి చేతులు దు లుపుకోకుండా కొనుగోళ్ల ప్రక్రియపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

Updated Date - 2020-10-23T11:34:46+05:30 IST