మద్దతు ధర కల్పించేందుకే కొనుగోలు కేంద్రాలు

ABN , First Publish Date - 2021-05-11T05:23:17+05:30 IST

మద్దతు ధర కల్పించేందుకే కొనుగోలు కేంద్రాలు

మద్దతు ధర కల్పించేందుకే కొనుగోలు కేంద్రాలు
కొనుగోలు కేంద్రంలో వడ్లను పరిశీలిస్తున్న డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌

  • డీసీసీబీ డైరెక్టర్‌, ఆమనగల్లు పీఎసీఎస్‌ చైర్మన్‌ గంప వెంకటేశ్‌ 

కడ్తాల్‌: రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని డీసీసీబీ డైరెక్టర్‌, ఆమనగల్లు పీఎసీఎస్‌ చైర్మన్‌ గంప వెంకటేశ్‌ అన్నారు. కడ్తాలలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జడ్పీటీసీ దశరథ్‌, ఎంపీటీసీలు లచ్చిరామ్‌, గోపాల్‌, విండో డైరెక్టర్‌ వెంకటేశ్‌లతో కలిసి పరిశీలించారు. కాగా కొనుగోలు కేంద్రాన్ని బాలుర పాఠశాలలోకి మార్చామన్నారు. ఆమనగల్లు, కడ్తాల, ముద్విన్‌ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 63వేల బస్తాల వడ్లు కొన్నామని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వెంకటయ్య, వెంకటేశ్‌, సీఈవో దేవేందర్‌ పాల్గొన్నారు.

  • కొనుగోలు కేంద్రాలకు మరిన్ని బస్తాలు పంపాలి

యాచారం: వరి కోతలు ముమ్మరంగా సాగుతుండడంతో మండలానికి మరో 50వేల బస్తాలు గన్నీ బ్యాగులు పంపాలని, తడిసిన వడ్లు కొనాలని బీజేపీ మండల అధ్యక్షుడు టి.రవి ప్రభుత్వాన్ని కోరారు. బస్తాలు చాలక రైతులు కళ్లంలోనే వడ్లు ఎండబోస్తున్నారని తెలిపారు.

  • ధాన్యం కొనుగోలుకు సహకరించాలి

షాద్‌నగర్‌రూరల్‌: రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు అధికారులు పూర్తి సహకారం అందించాలని జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి విజ్ఞప్తి చేశారు. స్థానిక మార్కెడ్‌ యార్డులో సోమవారం కార్యదర్శులు, సిబ్బంది, రైతులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం తీసుకువచ్చిన రైతులకు గన్నీ బ్యాగులు ఇవ్వాలని సూచించారు. మార్కెట్లో రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు పాపయ్య యాదవ్‌, బీమయ్య, రైతులు తదితరులున్నారు.   

  • మిల్లర్ల ప్రమేయంతో రైతులకు అన్యాయం

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మిల్లర్ల ప్రమేయంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశముందని, వారి ప్రమేయం లేకుండా చేసి రైతులకు నష్టం జరగకుండా చూడాలని జిల్లా కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ చల్లా శ్రీకాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మార్కెట్‌కు ఽధాన్యాన్ని తీసుకువచ్చే రైతులకు తేదీలు కేటాయించి చీటీలు రాసి ఇస్తున్నారని, ధాన్యం తీసుకువచ్చిన తర్వాత తేమ ఉందంటూ కొర్రీలు పెడుతుండటంతో గత్యంతరం లేక రైతులు ధాన్యాన్ని అక్కడే ఆరబోసుకుంటున్నారని తెలిపారు. వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిసి రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మిల్లర్లు తరుగు పేరుతో కిలో నుంచి రెండు కిలోలు తీస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2021-05-11T05:23:17+05:30 IST