రెవెన్యూ

ABN , First Publish Date - 2020-09-08T10:28:53+05:30 IST

రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోం ది.

రెవెన్యూ

విలేజ్‌ రెవెన్యూ అధికారులను ఇతర శాఖల్లోకి మార్చే అవకాశం

రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకుఙ ఆదేశాలు

జిల్లాలో 203 మంది వీఆర్వోలకు వేరే బాధ్యతలు

వీఆర్‌ఏలను యధావిధిగా కొనసాగించనున్న ప్రభుత్వం

భూముల రిజిస్ట్రేషన్‌ ఇక తహసీల్దార్ల చేతుల్లోకి


కామారెడ్డి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోం ది. శాసనసభ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెవెన్యూ వ్యవస్థ అవినీతిలో కూరుకు పోయింది. వారి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వ స్తోందని రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే గ్రా మ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయడమే ముఖ్య మార్గమని భావిస్తున్న ప్రభుత్వం వీఆర్వోలను ఇతర శాఖలలోకి కలిపి వేయాలని నూతన రెవె న్యూ చట్టాన్ని తీసుకువస్తోంది. దీంట్లో భాగంగా గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న గ్రామ రె వెన్యూ అధికారులను తొలగించి వారిని ఇతర శాఖల్లో చేర్చి తహసీల్దార్లను కుదించి ఆర్‌డీవోలకు అధికారాలను కట్ట బెట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తు న్నాయి.


దాంట్లో భాగంగా సోమవారం ప్రభుత్వం గ్రామరెవెన్యూ అధికారుల వ్యవస్థను రద్దుచేసేందుకు వారి వద్ద ఉన్న రికార్డులను సాయం త్రం 5 గంటల వరకు ఆయా జిల్లాల కలెక్టర్‌లు స్వాధీనం చేసుకొని రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించింది. ప్రభుత్వ రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే గ్రామరెవెన్యూ వ్యవస్థ రద్దు ఒకటే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. దీంట్లో భాగంగా వీఆర్‌వోలను ఇతర శాఖల్లో కలిపేస్తున్నారు. గ్రా మ రెవెన్యూ వ్యవస్థ రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెవెన్యూశాఖలోని తహసీ ల్దార్లకు భూముల అమ్మకాల రిజిస్ట్రేషన్‌ అధి కారాన్ని కట్టబెట్టాలని యోచిస్తోంది. వాణిజ్య పరమైన భూములు, భవనాలు, పట్టణాల్లోని భవనాలు, భూములను రిజిస్ట్రేష న్‌శాఖ అధికా రులకు రిజిస్ట్రేషన్‌ చేసే బాధ్యతలను అప్పగిం చాలని నూతన రెవెన్యూ చట్టంలో పొందుపరిచి అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.


జిల్లాలో 473 రెవెన్యూ గ్రామాలు..

జిల్లాలో 22 మండలాలు ఉండగా 526 గ్రామాలు, 3 రెవెన్యూ డి విజన్లు ఉన్నాయి. 473 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటికి 255 వీ ఆర్వోలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 203 మంది వీఆర్‌వోలు మాత్రం వీధులు నిర్వహిస్తున్నారు. 22 మండలాలకు తహసీల్దార్లు 22 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 19 మండలాలకు తహసీల్దార్లు ఉన్నారు. రామారెడ్డి, నిజాంసాగర్‌, పెద్దకొడప్‌గల్‌లో తహసీల్దార్లు లేక పోస్టులు ఇన్‌చార్జిలతో నిర్వహిస్తున్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లు 22 మంది ఉ న్నారు. అసిస్టెంట్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లను ప్రభుత్వం నియమించలేదు. ఆ పోస్ట్‌లు ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం వీఆర్‌వోల వద్ద ఉ న్న భూ సంబంధించిన రికార్డులను సోమవారం సాయంత్రం 5 గం టల్లోగా తహసీల్దార్లు సహాయంతో రికార్డులను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ కలెక్టర్లను ఆదేశించారు. దీంతో వీఆర్వోల నుంచి రికార్డులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మరికొంత మంది నుంచి రికార్డులను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.


రిజిస్ట్రేషన్‌ల బంద్‌కు ప్రభుత్వం ఆదేశాలు..

రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో గ్రామరెవెన్యూ అధికారుల నుంచి రికార్డులను స్వాధీ నం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాటు మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను కొనసాగించవద్దని ప్ర భుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి బాన్సువాడ, బిచ్కుందలో ఉన్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ నిలిచిపోనుంది. అలాగే తహసీల్‌ కార్యాలయా ల్లో కూడా రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ నిలిచిపోనుంది. ప్రభు త్వం తిరిగి ఆదేశాలు జారీ చేస్తేనే రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ మళ్లీ పునః ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.


ఏసీబీకి చిక్కడం వల్లే ప్రక్షాళన..!

రెవెన్యూశాఖలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ మంది ఏసీబీ అధి కారులకు పట్టుబడడంతోనే నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురా వాలని ప్రభుత్వం భావించింది. గ్రామంలో రెవెన్యూ అఽధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నా రనే ఉద్దేశంతోనే క్షేత్ర స్థాయిలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారుల వ్య వస్థకు మంగళం పాడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ దిశగా అడు గులు వేస్తూ గ్రామ రెవెన్యూ అధికారులను ఇతర శాఖలలోకి పంపిం చి తహసీల్దార్లు ఆధ్వర్యంలోనే భూముల క్రయ, విక్రయాలు రిజిస్ట్రేష న్‌లు జరిగే విధంగా నూతన రెవెన్యూ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కూడా ఇత ర శాఖల్లో పనిచేసే వారికంటే రెవెన్యూ శాఖలో పనిచేసిన గ్రామ రెవె న్యూ అధికారులతో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లు, తహసీల్దార్లు కొంద రు ఏసీబీకి చిక్కిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి.


ఇదే తీరు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూశాఖలో పనిచేసే అధికారులు సిబ్బంది ఏసీబీ అధి కారులకు చిక్కడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలు స్తోంది. జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు పరచాలని ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీంతో జిల్లాలో ఉన్న 203 మంది గ్రామరెవెన్యూ అధికారులు ఇతర శాఖలలోకి బదిలీ కానున్నారు. వీఆర్‌ఏలు మాత్రం యాథావిధిగా కొనసాగుతూ తహసీ ల్దార్లు కనుసన్నల్లో పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


రికార్డులు స్వాధీనం చేసుకోవాలి

కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి, సెప్టెంబరు 7: వీఆర్‌వోల వద్ద ఉన్న అన్ని రకాల రికార్డులు స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌ శరత్‌ తహసీల్దార్లను ఆ దేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రెవెన్యూ డివి జనల్‌ అధికారులు, తహసీల్దార్‌లతో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, ఇతర అన్ని రకాల రికార్డులను ఒకటి కూడా మిస్‌ కాకుండా నూటికి నూరు శాతం స్వాధీనం చేసుకొని తమ ఆధీనంలో ఉంచుకోవాలన్నారు. రికార్డుల స్వాధీనం చేసిన అనంతరం వీఆర్వోల నుంచి తమ వద్ద ఎలాంటి రికార్డులు లేవని తెలిపే స్వీయ ధ్రువీకరణ పత్రం తీసుకో వాలని తెలిపారు. రికార్డులను కలెక్టరేట్‌కు సమర్పించాలని సూచిం చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, కలెక్టరేట్‌ ఏవో శ్రీనివా స్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-08T10:28:53+05:30 IST