పూరి ఎవరినీ ఫాలో కాడు..!

Apr 18 2021 @ 12:03PM

టాలీవుడ్‌లో పూరి జగన్నాధ్ వర్కింగ్ స్టైల్ కంప్లీట్‌గా వేరే లెవల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో దర్శకుడిగా మారిన పూరి జగన్నాధ్..మొదటి సినిమాతోనే ఇలాంటి డైరెక్టర్ కదా ఇండస్ట్రీకి కావాల్సింది అని ఇండస్ట్రి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. ఇడియట్, అమ్మా నాన్నా ఒక తమిళమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, పోకిరి, బిజినెస్ మాన్, శివమణి, సూపర్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీశాడు. అంతేకాదు పోకిరి సినిమాతో 75 ఏళ్ళ ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశాడు పూరి. పూరి హీరో కోసం కథ రాయడు... ఎప్పుడు స్టార్ హీరోల కోసం ఎదురు చూడడు. కథ రాసుకున్నాక.. ఆ సమయంలో తనకి.. ఏ హీరో ఈ కథ చేస్తే బావుంటుంది..అనిపిస్తే ఆ హీరో డేట్స్ తీసుకొని సినిమా తీసేస్తాడు. ఇక పూరి సినిమా అంటే నాలుగైదు నెలలు చాలా ఎక్కువ. అందుకే పూరిలా ఏ డైరెక్టర్ సినిమా చేయలేరని చెప్పుకుంటారు. కొన్ని విషయలాలో పూరిని మిగతా దర్శకులు ఫాలో కావాలి తప్ప ..పూరి మాత్రం ఎవరినీ ఫాలో కాడు.. అంటుంటారు. 

 

ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్ ఇండియన్ సినిమా ట్రెండ్ నడుస్తోంది. కనీసం నాలుగు భాషల్లో ఓ 200 కోట్లు పెట్టి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నారు. కానీ పూరికి చిన్న హీరో చాలు. పాన్ ఇండియన్ సినిమా 200 కోట్లు కావాలి అనే లెక్కలు కూడా ఉండవు. అందుకే విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ రేంజ్‌లోనే తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా బడ్జెట్ 120 కోట్లని చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా టాలీవుడ్‌తో పాటు మిగతా సౌత్ భాషలకి పరిచయం చేస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలీడ్ హిట్ కొట్టిన పూరి.. లైగర్ సినిమాతో ఎలాంటి సక్సస్ అందుకుంటాడో.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.